పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : 9దక్షసావర్ణిమనువు చరిత్ర

 •  
 •  
 •  

8-417-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అట మీఁదటి కాలంబున వరుణ నందనుండగు దక్షసావర్ణి తొమ్మిదవ మను వయ్యెడు; నతని కొడుకులు ధృతకేతు, దీప్తకేతు, ప్రముఖులు రాజులును; బరమరీచి గర్గాదులు నిర్జరులును; నద్భుతుం డను వాఁడింద్రుండును; ద్యుతిమత్ప్రభృతులగు వారలు ఋషులును నయ్యెదరు; అందు.

టీకా:

అటమీదటన్ = ఆ తరువాత; కాలంబునన్ = కాలమునందు; వరుణ = వరుణుని; నందనుండు = పుత్రుడు; అగు = అయిన; దక్షసావర్ణి = దక్షసావర్ణి; తొమ్మిదవ = తొమ్మిదవ (9); మనువు = మనువు; అయ్యెడున్ = అవుతాడు; అతని = అతని యొక్క; కొడుకులు = పుత్రులు; ధృతకేతు = ధృతకేతుడు; దీప్తికేతు = దీప్తికేతుడు; ప్రముఖులు = మున్నగువారు; రాజులును = రాజులు; పర = పరులు; మరీచి = మరీచులు; గర్గ = గర్గులు; ఆదులు = మున్నగువారు; నిర్జరులును = దేవతలును; అద్భుతుండు = అద్భుతుడు; అను = అనెడి; వాడు = వాడు; ఇంద్రుండును = ఇంద్రుడును; ద్యుతిమత్ = ద్యుతిమంతుడు; ప్రభ్రుతులు = మున్నగువారు; ఋషులున్ = ఋషులు; అయ్యెదరు = అవుతారు; అందు = ఆ కాలమున.

భావము:

అటు తరువాతి కాలంలో వరుణుని కొడుకైన దక్షసావర్ణి తొమ్మిదవ మనువు అవుతాడు. అతని కొడుకులైన ధృతకేతువు, దీప్తకేతువు మొదలైనవారు రాజులు అవుతారు. పరులు, మరీచులూ, గర్గు మొదలైనవారు దేవతలు అవుతారు. అద్భుతుడు అనేవాడు ఇంద్రుడు అవుతాడు. ద్యుతిమంతుడు మొదలైనవారు సప్తఋషులు అవుతారు.

8-418-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

నుజహరణుఁ డంబుధార కాయుష్మంతు
కు జనించి రక్షణంబు చేయ
మూఁడు లోకములను మోదంబుతో నేలు
ద్భుతాఖ్య నొప్పు మర విభుఁడు.

టీకా:

దనుజహరణుడు = హరి; అంబుధార = అంబుధార; కున్ = కు; ఆయుష్మంతున్ = ఆయుష్మంతున; కున్ = కు; జనించి = పుట్టి; రక్షణంబు = కాపాడుట; చేయన్ = చేయుచుండగా; మూడు = మూడు (3); లోకములను = లోకములను; మోదంబు = సంతోషము; తోన్ = తోటి; ఏలున్ = పరిపాలించును; అద్భుత = అద్భుతుడు; ఆఖ్యన్ = అనుపేరుతో; ఒప్పున్ = ఒప్పియుండెడి; అమరవిభుడు = దేవేంద్రుడు;

భావము:

ఆ కాలంలో విష్ణువు ఆయుష్మంతుడికీ అంబుధారకూ జన్మిస్తాడు. అతని రక్షణలో దేవేంద్రుడైన అద్భుతుడు మూడు లోకాలను సంతోషంగా పరిపాలిస్తాడు.
ఈ దక్షసావర్ణి మన్వంతరంలో భగవదవతారుడు ఆయుష్మంతుని పుత్రుడు ఋషభుడు అని వ్యాస మూలం.