పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : జగనమోహిని కథ

  •  
  •  
  •  

8-405-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కాము గెలువవచ్చుఁ గాలారి గావచ్చు
మృత్యుజయముఁ గలిగి మెఱయవచ్చు
నాఁడువారి చూపుటంపఱ గెలువంగ
శము గాదు త్రిపురవైరి కైన.

టీకా:

కామున్ = మన్మథుని; గెలువవచ్చున్ = జయించవచ్చును; కాలున్ = యముని; అరిన్ = ధిక్కరించినవాడు; కావచ్చున్ = అవ్వవచ్చును; మృత్యు = మరణముపై; జయము = గెలుపు; కలిగి = సాధించి; మెఱయవచ్చున్ = ప్రకాశించవచ్చును; ఆడువారి = స్త్రీల; చూపుల = చూపులనడి; అంపఱన్ = బాణములను; గెలువంగన్ = జయించుట; వశము = సాధ్యము; కాదు = కాదు; త్రిపురవైరి = పరమశివుని; కైనన్ = అయినప్పటికిని.

భావము:

మన్మథుడిని ఓడించి కామాన్ని జయించవచ్చు. యముని ధిక్కరించి, మృత్యుంజయుడై ప్రకాశించవచ్చు. కానీ, ఆడవారి వాలుచూపుల వాడిబాణాలను గెలవడం త్రిపురాంతకుడైన ఆ మహాశివుడికైనా సాధ్యంకాదు.