పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : జగనమోహిని కథ

  •  
  •  
  •  

8-404-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దాత్మకుఁడగు శంభుఁడు
గిడెను హరి నెఱిఁగి తనదు మాహాత్మ్యమునన్
వితత్రపుఁడై నిలిచెను
గువతనం బుడిగి హరియు గవాఁ డయ్యెన్.

టీకా:

జగత్ = భువనములే; ఆత్మకుడు = తానైనవాడు; అగు = అయిన; శంభుడు = శంకరుడు; మగిడెను = వెనుదిరిగెను; హరిన్ = విష్ణుమూర్తిని; ఎఱిగి = తెలిసికొని; తనదు = తన యొక్క; మహాత్మ్యమునన్ = గొప్పదనమువలన; విగత = పోయిన; త్రపుడు = లజ్జలనువిడిచినవాడు; ఐ = అయ్యి; నిలిచెను = నిలబడెను; మగువతనంబున్ = స్త్రీరూపమును; ఉడిగి = విడిచి; హరియున్ = విష్ణువుకూడ; మగవాడు = పురుషుడు; అయ్యెన్ = అయ్యెను.

భావము:

భువన స్వరూపుడు అయిన శివుడు తన మహిమాతిశయంవల్ల విష్ణు మాయను తెలుసుకుని, వెనుతిరిగాడు. విష్ణువు సిగ్గుతోపాటు, స్త్రీ రూపాన్ని విడిచిపెట్టి మగవాడిగా మారిపోయాడు.