పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : జగనమోహిని కథ

  •  
  •  
  •  

8-403.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నిర్మలామోఘ వీర్యంబు నేలమీఁదఁ
డిన చోటెల్ల వెండియుఁ బైడి యయ్యె
రణి వీర్యంబు పడఁ దన్నుఁదా నెఱింగి
దేవ మాయా జడత్వంబు దెలిసె హరుఁడు.

టీకా:

వీడి = ఊడిపోయి; వెన్నునన్ = వీపుమీద; ఆడు = కదులుచున్న; వేణీభరంబు = జడ; తోన్ = తోటి; జఘన = పిరుదుల; భార = బరువులచేత; ఆగత = కలిగిన; శ్రాంతి = అలసటల; తోడన్ = తోటి; మాయా = మాయా; వధూటి = సుందరి; ఐ = అయ్యి; మఱలి = వెనుతిరిగి; చూచుచున్ = చూస్తూ; పాఱు = పరుగెడుతున్న; విష్ణున్ = హరిని; అద్భుతకర్మున్ = హరిని; వెంటతగిలి = వెంటబడి; ఈశాను = పరమేశ్వరుని; మరల = ఇంకొకసారి; జయించెన్ = గెలిచెను; మరుండు = మన్మథుడు; అనన్ = అన్నట్లుగ; కరిణి = ఆడ ఏనుగు; వెన్కను = వెనుక; కరి = మగ ఏనుగు; కరణిన్ = విధమును; దాల్చి = పట్టి; కొండలున్ = కొండలు; ఏఱులున్ = కాలువలు; కొలకులున్ = కొలనులు; వనములు = తోటలు; దాటి = దాటి; శంభుడు = శంకరుడు; చనన్ = వెళ్లుతుండగ; తత్ = ఆ; మహాత్ము = మహాత్ముని.
నిర్మల = స్వచ్ఛమైన; వీర్యంబు = రేతస్సు; నేల = భూమి; మీదన్ = పైన; పడిన = పడినట్టి; చోటులు = స్థలములు; ఎల్లన్ = అంతయును; వెండియున్ = వెండి; పైడియున్ = బంగారము; అయ్యెన్ = ఏర్పడినది; ధరణిన్ = భూమిమీద; వీర్యంబు = రేతస్సు; పడన్ = పడగా; తన్ను = తనను; తానె = తనే; ఎఱింగి = తెలుసుకొని; దేవ = దివ్యమైన; మాయా = మాయ యొక్క; జడత్వంబున్ = మైమరపును; తెలిసె = తెలుసుకొనెను; హరుడు = శంకరుడు.

భావము:

“మన్మథుడు తిరిగి శివుని జయించాడా” అనట్లు ఆడఏనుగును వెంటాడే మగఏనుగు వలె శివుడు మోహినీరూపంలోవున్న విష్ణువు వెంటబడ్డాడు. ఆ మాయామానిని జడ వీడి వీపుపై వ్రేలాడుతున్నది. ఆమె పిరుదుల బరువుతో అలసిసొలసి వెనుతిరిగి చూస్తూ పరిగెడుతున్నది. ఆమె వెంట శివుడు కొండలూ, నదులూ, సరస్సులు, అడవులు దాటి వెళ్ళసాగాడు. అమోఘమైన ఆమహాత్ముని వీర్యం నేలపై పడింది. అది పడిన ప్రదేశమంతా వెండిగా, బంగారంగా రూపుదాల్చింది. ఆతరువాత శివుడు తన్ను తాను తెలుసుకున్నాడు. పరమాత్మునిమాయ వల్ల కలిగిన మైమరపును గమనించుకున్నాడు.