పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : హరి హర సల్లాపాది

  •  
  •  
  •  

8-387.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నిలుఁ డే రీతి విహరించు ట్ల నీవు
లసి వర్తింతు సర్వాత్మత్వ మొప్ప;
గములకు నెల్ల బంధమోక్షములు నీవ
నీవ సర్వంబుఁ దలపోయ నీరజాక్ష!

టీకా:

యత్ = నీ యొక్క; విలాసమున్ = లీలలను; మరీచి = మరీచిమహర్షి; ఆదులు = మున్నగువారు; ఎఱుంగరు = తెలియలేరు; నిత్యుడను = శాశ్వతుడను; ఐ = అయ్యి; ఉన్న = ఉన్నట్టి; నేనున్ = నేనుకూడ; ఎఱుగన్ = తెలియలేను; యత్ = నీయొక్క; మాయన్ = మాయవలన; అంధులు = గుడ్డివారు; ఐ = అయ్యి; అమర = దేవతలు; అసుర = రాక్షసులు; ఆదులు = మొదలగువారు; వనరెదరు = కష్టపడెదరు; అటన్ = అట; ఉన్న = ఇతరమైన; వారలు = వారనగా; ఎంత = ఎంత; ఏ = ఎట్టి; రూపమున్ = ఆకృతిని; పొందక = స్వీకరించకనే; ఏపారుదువు = అతిశయించెదవు; నీవున్ = నీవు; రూపివి = ఆకృతిదాల్చినవాడవు; ఐ = అయ్యి; సకలంబున్ = సర్వమును; రూపుచేయన్ = సృష్టించ; రక్షింపన్ = కాపాడుటకు; చెఱపన్ = నశింపజేయుటకు; కారణము = కారణభూతము; ఐన = అయిన; సచరాచరాఖ్యము = జగత్తనబడువాడవు; ఐ = అయ్యి; విలసిల్లుదు = ప్రకాశించెదవు; అంబరమునన్ = ఆకాశమునందు; అనిలుడు = వాయువు; ఏ = ఎట్టి; రీతిన్ = విధముగ.
విహరించున్ = విహరించునో; అట్ల = ఆ విధముగ; నీవు = నీవు; కలసి = కూడి; వర్తింతు = వర్తించెదవు; సర్వ = సర్వమునందు; ఆత్మకత్వము = తానైయుండుట; ఒప్పన్ = ఒప్పునట్లుగ; జగముల్ = లోకముల; కున్ = కు; ఎల్లన్ = అన్నిటియందు; బంధ = ఘటితము; మోక్షంబులన్ = వికలములు; నీవ = నీవే; నీవ = నీవే; సర్వంబున్ = సమస్తమును; తలపోయ = తరచిచూసిన; నీరజాక్ష = హరి.

భావము:

ఓ కమలలోచనా! నీలీలను మరీచి మొదలైన మహర్షులు సైతం తెలియలేరు. నీతోపాటూ ఉండే నేను కూడా తెలుసుకోలేను. నీమాయ తెలియక దేవతలు, రాక్షసులు కష్టపడతారు. ఇంక తక్కినవారెంత. నీవు ఏరూపాన్ని పొందకుండా పెంపొందుతావు. రూపాన్ని పొంది, అన్నింటినీ పుట్టించి కాపాడి అంతం చేయడానికి కారణమవుతావు. సకలచరాచర రూపుడవై వెలుగొందుతావు. ఆకాశంలో గాలి విహరించేవిధంగా సర్వాత్మకుడవై అన్నింటిలోనూ నీవు చేరే వుంటావు. లోకాలు పుట్టడమూ విడిపోవడమూ రెండూ నీవె. ఆలోచిస్తే అన్నీ నీవే.