పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : నముచి వృత్తాంతము

  •  
  •  
  •  

8-378-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

త్మబుద్ధిఁ దలఁచి యార్ద్రంబు శుష్కంబు
గాని సాధనంబు ఫే మనుచు
ది యమర్చి దాన మరులు మెచ్చంగ
ముచి శిరముఁ ద్రుంచె నాకవిభుఁడు.

టీకా:

ఆత్మన్ = తన యొక్క; బుద్ధిన్ = మనసునందు; తలచి = ఆలోచించుకొని; ఆర్ద్రంబున్ = తడిది; శుష్కంబున్ = పొడిది; కాని = కానట్టి; సాధనంబున్ = సాధనము, వస్తువు; ఫేనము = సముద్రపునురుగు; అనుచున్ = అనుచు; అది = అది; అమర్చి = కూర్చి; దానన్ = దానితో; అమరులు = దేవతలు; మెచ్చంగన్ = శ్లాఘించుచుండగ; నముచి = నముచి యొక్క; శిరమున్ = తలను; త్రుంచెన్ = నరికెను; నాకవిభుడు = ఇంద్రుడు.

భావము:

“తడిదీ పొడిదీ కాని వస్తువు సముద్రపు నురుగు ఒక్కటే” అని తనలో విచారించుకున్నాడు. ఆ ప్రకారంగానే సముద్రపు నురుగు అద్దిన వజ్రం ప్రయోగించి, ఇంద్రుడు నముచి శిరస్సు నరికేసాడు. అందుకు దేవతలు మెచ్చుకున్నారు.