పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : నముచి వృత్తాంతము

  •  
  •  
  •  

8-376-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"కొండల ఱెక్కలు ఖండించి వైచుచో-
జ్ర మెన్నఁడు నింత వాఁడి చెడదు;
వృత్రాసురాదుల విదళించుచో నిది-
దిరుగ దెన్నఁడు పనిఁ దీర్చికాని;
యింద్రుండఁ గానొకో యేను దంభోళియుఁ-
గాదొకో యిది ప్రయోగంబు చెడెనొ
నుజాధముఁడు మొనతాఁకుఁ దప్పించెనో-
భిదురంబు నేఁ డేల బెండుపడియె;"

8-376.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నుచు "వజ్రి వగవ నార్ద్ర శుష్కంబులఁ
జావకుండఁ దపము లిపె నీతఁ
డితర మెద్ది యైన నింద్ర! ప్రయోగింపు
వైళ" మనుచు దివ్యవాణి పలికె.

టీకా:

కొండల = పర్వతముల యొక్క; ఱెక్కలున్ = రెక్కలను; ఖండించి = తెగగోసి; వైచుచోన్ = వేయునప్పుడు; వజ్రము = వజ్రము; ఎన్నడున్ = ఎప్పుడుకూడ; ఇంత = ఇంత ఎక్కువగా; వాడి = పదును; చెడదు = చెడిపోలేదు; వృత్ర = వృత్రుడు యనెడి; అసుర = రాక్షసులు; ఆదులన్ = మున్నగువారిని; విదళించుచచోన్ = సంహరించునప్పుడు; ఇది = ఇది; దిరుగదు = వెనుదీయలేదు; ఎన్నడున్ = ఎప్పుడుకూడ; పని = ప్రయోగించిన పనిని; తీర్చి = సాధించును; కాని = తప్ప; ఇంద్రుండన్ = ఇంద్రుడను; కానొకో = కాదేమో; ఏనున్ = నేను; దంభోళియున్ = వజ్రాయుధము; కాదొకో = కాదేమో; ఇది = ఇది; ప్రయోగంబున్ = ఉపయోగంచుటయందు; చెడెన్ = పొరపాటు జరిగెనా ఏమి; దనుజ = రాక్షసుడైన; అధముడు = నీచుడు; మొన = ఆయుధపు కొన; తాకున్ = తాకిడిని; తప్పించెనో = తప్పించుకొనెనేమో; భిదురంబు = వజ్రము; నేడు = ఇవాళ; ఏల = ఎందుకు; బెండుపడియెన్ = మొక్కపోయెను; అనుచున్ = అనుచు.
వజ్రి = ఇంద్రుడు; వగవన్ = విచారించుచుండగ; ఆర్ద్ర = తడివాటివలన; శుష్కంబులన్ = పొడివాటివలనన్; చావకుండన్ = మరణించకుండగ; తపమున్ = తపస్సు; సలిపెన్ = చేసెను; ఈతడు = ఇతను; ఇతరమున్ = మరింకొకటి; ఎద్ది = ఏది; ఐనన్ = అయిన; ఇంద్ర = ఇంద్రుడా; ప్రయోగింపుము = ఉపయోగింపుము; వైళమన్ = శ్రీఘ్రమే; అనుచున్ = అనుచు; దివ్యవాణి = ఆకాశవాణి; పలికెన్ = పలికెను.

భావము:

ఈ వజ్రాయుధానికి కొండల రెక్కలు కత్తిరించేటప్పుడు వాడి తగ్గలేదు. వృత్రాసురుడు మున్నగు రక్కసులను సంహరించేటప్పుడు ఏనాడూ పని సాధించకుండా వెనుదిరిగింది లేదు. ఇప్పుడు నముచి విషయంలో ఇలా అయింది ఏమిటి? అసలు, నేను ఇంద్రుడి నేనా? ఇది వజ్రాయుధమేనా? దీనిని ప్రయోగించడంలో పొరపాటు ఏమైనా జరిగిందా? ఈ దుష్టరాక్షసుడు దీని పదును తెగకుండా చేసాడా ఏమిటి? ఇది ఇవాళ ఎందుకు శక్తిని కోలుపోయింది? అనుకుంటూ దేవేంద్రుడు తెగ విచారిస్తున్నాడు. ఇంతలో ఆకాశవాణి “ఇంద్రా! ఈ రాక్షసుడు తడివాటితో కానీ, పొడివాటితో కానీ చావులేకుండా వరం పొందాడు. వేరే మరొక దానిని దేనినైనా వేగిరం ప్రయోగించు”అని పలికింది.