పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : జంభాసురుని వృత్తాంతము

  •  
  •  
  •  

8-371-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విఱిగిన సేనఁ గాంచి సురవీరుఁ "డొహో" యని బిట్టు చీరి క్ర
మ్మఱఁ బురికొల్పి పాకబల స్తకముల్ నిశితాస్త్రధారలన్
నెసిన తీక్ష్ణవజ్రమున నేలకు వ్రాల్చెను వాని చుట్టముల్
వెచిరి; తచ్చమూపతులు విహ్వలులై చెడి పాఱి రార్తితోన్.

టీకా:

విఱిగిన = కకావికలైన; సేనన్ = సైన్యమును; కాంచి = కనుగొని; సురవీరుడు = ఇంద్రుడు; ఓహో = ఓయ్; అని = అని; బిట్టు = గట్టిగా; చీరి = పిలిచి; క్రమ్మఱన్ = మరల; పురికొల్పి = ఉత్సాహపరచి; పాక = పాకుని; బల = బలుని; మస్తకముల్ = తలలను; నిశిత = వాడియైన; అస్త్ర = కత్తి; ధారలన్ = పదునులతో; నెఱసిన = నిండినట్టి; తీక్ష్ణ = అతితీవ్రమైన; వజ్రమునన్ = వజ్రాయుధముతో; నేల = భూమి; కున్ = కి; వ్రాల్చెను = కూల్చెను; వాని = అతని; చుట్టముల్ = బంధువులు; వెఱచిరి = బెదిరిపోయిరి; తత్ = అతని; చమూపతులున్ = సేనానాయకులు; విహ్వలుల = భయకంపితులు; ఐ = అయి; చెడి = చెదరి; పాఱిరి = పారిపోయిరి; ఆర్తి = దుఃఖము; తోన్ = తోటి.

భావము:

వెనుదిరిగి పారిపోతున్న తన సైన్యాన్ని ఓహో! అంటూ గట్టిగా పిలిచాడు. సైనికులను యుద్ధానికి పురిగొల్పాడు. పాకుడి తలను వాడి బాణాలతోనూ, బలాసురుడి తలను వజ్రాయుధంతోనూ నేలకూల్చాడు. అది చూసి బలి బంధువులు భయపడిపోయారు. అతని సేనా నాయకులు భయకంపితులై ఏడుస్తూ పారిపోసాగారు.