పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : జంభాసురుని వృత్తాంతము

  •  
  •  
  •  

8-369-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"హో! దేవతలార! కుయ్యిడకుఁ; డే నున్నాఁడ "నం చంబుభృ
ద్వాహుం డా శరబద్ధ పంజరము నంతం జించి తేజంబునన్
వాహోపేత రథంబుతోడ వెలికిన్ చ్చెన్ నిశాంతోల్ల స
న్మాహాత్మ్యంబునఁ దూర్పునం బొడుచు నా మార్తాండు చందంబునన్.

టీకా:

ఓహో = ఓ; దేవతలారా = దేవతలు; కుయ్యిడకుడు = భయపడకండి; ఏన్ = నేను; ఉన్నాడను = ఉన్నాను; అంచున్ = అనుచు; అంబుభృద్వాహుండు = ఇంద్రుడు, {అంబుభృద్వాహుడు – అంబుభృత్ (మేఘము) వాహుడు (వహించువాడు), ఇంద్రుడు}; ఆ = ఆ; శర = బాణములచే; బద్ధ = కట్టబడిన; పంజరమున్ = పంజరమును; అంతన్ = అంతటిని; చించి = చీల్చివేసి; తేజంబునన్ = ప్రకాశముతో; వాహ = గుఱ్ఱముల; ఉపేత = సహితమైన; రథంబున్ = రథము; తోడన్ = తోపాటు; వెలికిన్ = బయటకు; వచ్చెన్ = వచ్చివేసెను; నిశాంత = ఉదయకాలమున; ఉల్లసత్ = ఉల్లాసముతోను; మహాత్మ్యంబునన్ = మహిమతోటి; తూర్పునన్ = తూర్పువైపున; పొడుచు = ఉదయించెడి; ఆ = ఆ; మార్తాండు = సూర్యుని; చందంబునన్ = వలె.

భావము:

ఇంతలో దేవేంద్రుడు “ఓ దేవతలారా! భయపడకండి. నేను ఇక్కడే ఉన్నాను.” అంటూ ఆ అమ్ముల పంజరాన్ని చీల్చుకుని గుఱ్ఱాలతో కూడిన రథంతోపాటు ఉల్లాసంతో మహిమతో ఉదయకాలంలో తూర్పున ఉదయించే సూర్యుడిలా ప్రకాశిస్తూ బయటకు వచ్చాడు.