పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : జంభాసురుని వృత్తాంతము

  •  
  •  
  •  

8-366-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విబుధలోకేంద్రుని వేయుగుఱ్ఱంబుల-
న్ని కోలల బలుఁ దర నేసె
నిన్నూట మాతలి నిన్నూట రథమును-
నా రీతి నింద్రు ప్రత్యంగకమును
వేధించెఁ; బాకుండు వింట వాఁ డస్త్రంబు-
లేయుటఁ దొడుగుట యెఱుఁగరాదు;
నక పుంఖంబుల కాండంబు లొక పది-
యేనింట నముచియు నేసి యార్చె;

8-366.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లిమి నిట్లు ముగురు గవాని రథ సూత
హితు ముంచి రస్త్ర జాలములను
నజలోక సఖుని వాన కాలంబున
మొగిలు గములు మునుఁగ మూఁగినట్లు.

టీకా:

విబుధలోకేంద్రుని = ఇంద్రుని; వేయు = వెయ్యి (1,000); గుఱ్ఱంబులన్ = గుఱ్ఱములను; అన్ని = అన్ని; కోలలన్ = బాణములతో; బలుడు = బలుడు; అదరన్ = అదిరిపోవునట్లు; ఏసెన్ = కొట్టెను; ఇన్నూటన్ = రెండునూర్లతో; మాతలిన్ = సారథిని; ఇన్నూటన్ = రెండునూర్లతో; రథమును = రథముతో; ఆరీతిన్ = ఆదేవిధముగ; ఇంద్రున్ = ఇంద్రుని యొక్క; ప్రతి = ప్రతియొక్క; అంగకమున్ = సేనాభాగమును; వేధించెన్ = బాధించెను; పాకుండు = పాకుడు; వింటన్ = ధనుస్సునందు; వాడు = అతడు; అస్త్రంబున్ = బాణములను; ఏయుటన్ = వేయుట; తొడగుట = సంధించుట; ఎఱుగన్ = తెలియుట; రాదు = వీలుకాదు; కనక = బంగారు; పుంఖంబులన్ = బాణముపింజలుగల; కాండంబుల్ = బాణములను; ఒక = ఒక; పదియేనింటన్ = పదిహేనింటిని (15); నముచియున్ = నముచ; ఏసి = వేసి; ఆర్చెన్ = కేకలువేసెను.
బలిమిన్ = బలవంతముగ; ఇట్లు = ఇలా; ముగురు = ముగ్గురు (3); పగవానిన్ = శత్రువును; రథ = రథమును; సూత = సారథితో; సహితున్ = కూడినవానిని; ముంచిరి = కప్పివేసిరి; అస్త్ర = బాణముల; జాలములనున్ = సమూహములతో; వనజలోకసఖునిన్ = సూర్యుని; వానాకాలంబునన్ = వానాకాలమునందు; మొగిలి = మబ్బుల; గములు = గుంపులు; మునుగన్ = కనపడకుండగా; మూగినట్లు = మూసేసినవిధముగ.

భావము:

దేవేంద్రుని వేయి గుఱ్ఱాలను బలాసురుడు వెయ్యి బాణాలతో అదరగొట్టాడు. మాతలిని, రథాన్ని, ఇంద్రుడి ప్రతి అవయవాన్నీ రెండువందల బాణాలతో బాధించాడు. పాకుడు ధనుస్సుకు బాణాన్ని సంధించడం, ప్రయోగించడం తెలియని వేగంతో యుద్ధం చేసాడు. నముచి వాడియైన బంగారు పిడులు కలిగిన బాణాలను వేసి కేకలు పెట్టాడు. ఇలా వానాకాలంలో మేఘాలు సూర్యుని కప్పేసిన విధంగా, బలవంతులైన ఆ ముగ్గురు ఇంద్రుడిని, అతని రథాన్ని, సారథిని, అమ్ముల సమూహాలతో ముంచివేశారు.