పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : జంభాసురుని వృత్తాంతము

  •  
  •  
  •  

8-364-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శూల నిహతి నొంది స్రుక్కక యార్చిన
సూతు వెఱకు మంచు సురవిభుండు
వాని శిరముఁ దునిమె జ్రఘాతంబున
దైత్య సేన లెల్ల ల్ల డిల్ల.

టీకా:

శూల = బల్లెము; నిహతిన్ = దెబ్బ; ఒంది = పొందినను; స్రుక్కక = తల్లడిల్లకుండగ; ఆర్చిన = కేకలువేయగ; సూతున్ = రథసారథిని; వెఱకుము = బెదిరిపోకుము; అంచున్ = అనుచు; సురవిభుండు = ఇంద్రుడు; వాని = అతని; శిరమున్ = తలను; తునిమెన్ = ఖండించెను, నరికెను; వజ్ర = వజ్రము యొక్క; ఘాతంబునన్ = దెబ్బతో; దైత్య = రాక్షస; సేనన్ = సైన్యములు; ఎల్లన్ = అన్ని; తల్లడిల్ల = చెల్లాచెదురుకాగా.

భావము:

జంభాసురుని బల్లెపు దెబ్బతిని, తల్లడిల్లకుండా మాతలి గట్టిగా కేకలు వేసాడు. అతనిని భయపడవద్దని చెప్పి, ఇంద్రుడు వజ్రాయుధంతో జంభుని తల నరికాడు. అది చూసి, రాక్షస సైన్యాలు చెల్లాచెదురు అయ్యాయి.