పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : హరి అసురుల శిక్షించుట

  •  
  •  
  •  

8-356-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వీరుఁడు దానవ నాథుఁడు
నాసముల నింద్రు మేన నాటించి మహా
ఘోరాయుధ కల్పములగు
శూరాలాపములు చెవులఁ జొనిపెన్ మరలన్.

టీకా:

వీరుడు = శూరుడు; దానవనాథుడు = బలిచక్రవర్తి; నారసములన్ = బాణములను; ఇంద్రు = ఇంద్రుని; మేనన్ = దేహమునందు; నాటించి = వేసి; మహా = గొప్ప; ఘోర = ఘోరమైన; ఆయుధ = బాణములకు; కల్పములు = సమానములైనవి; అగు = అయిన; శూరాలాపములు = సూటిపోటిమాటలు; చెవులజొనిపెన్ = వినిపించెను; మరలన్ = ఇంకను.

భావము:

వీరాధివీరుడు, దానవ సామ్రాజ్యాధినేత అయిన బలిచక్రవర్తి ఇంద్రుని శరీరం మీద నాటేలా వాడైన ఇనపబాణాలు వేసాడు. అతని చెవులు చిల్లులు పడేలా భీకరమైన పలుకుల వంటి సూటిపోటి మాటలు పలికాడు.