పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : హరి అసురుల శిక్షించుట

  •  
  •  
  •  

8-354-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యము లపజయములు సంపద లాపద
నిల చలిత దీపికాంచలములు
చంద్రకళలు మేఘయములు దరఁగలు
మెఱుఁగు లమరవర్య! మిట్టిపడకు."

టీకా:

జయముల్ = జయములు; అపజయములున్ = అపజయములు; సంపదలు = సంపదలు; ఆపదలు = ఆపదలు; అనిల = గాలికి; చలిత = చలించెడి; దీపికాంచలములు = దీపపు శిఖలు; చంద్ర = చంద్రుని యొక్క; కళలు = కళలు; మేఘ = మబ్బుల; చయములున్ = గుంపులు; తరగలున్ = నీటిఅలలు; మెఱుగులు = మెరుపుతీగలు; అమరవర్య = ఇంద్రా; మిట్టిపడకు = విఱ్ఱవీగవద్దు.

భావము:

ఇంద్రా! ఎంతటి దేవతలలో మేటివి అయినా. జయాలు అపజయాలూ, సంపదలూ ఆపదలూ సర్వం అశాశ్వతాలు అనీ, అవి గాలిలో దీపాలు, చంద్రకళలు, మేఘమాలికలు, మెరుపుతీగలు వంటివి అనీ తెలుసుకో. విఱ్ఱవీగబోకు.”