పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : హరి అసురుల శిక్షించుట

  •  
  •  
  •  

8-349-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు సముద్యత భిదుర హస్తుండై యింద్రుండుఁ దన పురోభాగంబునం బరాక్రమించుచున్న విరోచననందను నుపలక్షించి యిట్లనియె.

టీకా:

ఇట్లు = ఇలా; సముద్యత = పైకెత్తిన; భిదుర = వజ్రాయుధమును; హస్తుండు = చేతధరించినవాడు; ఐ = అయ్యి; ఇంద్రుండు = ఇంద్రుడు; తన = తన; పురోభాగంబునన్ = ఎదుట; ఆక్రమించుచున్న = పరాక్రమిస్తున్న; విరోచననందనున్ = బలిని; ఉపలక్షించి = ఉద్దేశించి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

వజ్రాయుధాన్ని ఎత్తి పట్టుకుని జళిపిస్తూ, ఇంద్రుడు తన ఎదుట పరాక్రమం ప్రదర్శిస్తున్న బలిచక్రవర్తితో ఇలా అన్నాడు.