పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : హరి అసురుల శిక్షించుట

  •  
  •  
  •  

8-348-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

బాహుబలంబున నింద్రుఁడు
సాసమున బలిని గెలువ మకట్టి సము
త్సామున వజ్ర మెత్తిన
హాహానినదంబు జేసి ఖిల జనములున్.

టీకా:

బాహుబలంబునన్ = భుజబలముతో; ఇంద్రుడు = ఇంద్రుడు; సాహసమునన్ = సాహసముతో; బలిని = బలిచక్రవర్తిని; గెలువన్ = గెలుచుటకు; సమకట్టి = పూనుకొని; సముత్సాహమునన్ = పట్టుదలతో; వజ్రమున్ = వజ్రాయుధమును; ఎత్తిన = పైకెత్తగా; హాహా = హాహాకారముల; నినదంబున్ = కేకలను; చేసిరి = చేసితిరి; అఖిల = సమస్తమైన; జనములున్ = వారును.

భావము:

అంతట బలిచక్రవర్తిని జయించడానికి సాహసించి బాహుబలంతో పూనుకుని ఇంద్రుడు పట్టుదలగా వజ్రాయుధాన్ని పైకెత్తాడు. దానితో రాక్షసు లందరూ హాహాకారాలు చేశారు.