పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : హరి అసురుల శిక్షించుట

  •  
  •  
  •  

8-346-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పడి మాలి సుమాలులు
బెరించినఁ దలలుఁ ద్రుంచెఁ బృథు చక్రహతిన్;
దఁగొని గరుడుని ఱెక్కలు
చెరించిన మాల్యవంతు శిరమున్ వ్రేసెన్.

టీకా:

పదపడి = అటుపిమ్మట; మాలి = మాలి; సుమాలులు = సుమాలి అనువారు; బెదిరించినన్ = భయపెట్టగా; తలలున్ = శిరస్సులను; త్రుంచెన్ = ఖండించెను; పృథు = గొప్పదైన; చక్ర = చక్రపు; హతిన్ = దెబ్బతో; గదన్ = గదను; కొని = తీసుకొని; గరుడుని = గరుత్మంతుని; ఱెక్కలున్ = రెక్కలను; చెదరించిన = చెదరగొట్టిన; మాల్యవంతు = మాల్యవంతుని; శిరమున్ = తలను; వ్రేసెన్ = నరికెను.

భావము:

తరువాత విష్ణుని మాలీ, సుమాలీ బెదిరించారు. అంతట నారాయణుడు తన మహా శక్తిమంతమైన చక్రాయుధంతో వారి తలలు తెగనరికాడు. మాల్యవంతుడు గద పట్టుకుని గరుడుని రెక్కలు చెదరగొట్టాడు. హరి వాని తల కూడా చక్రాయుధంతో ఖండించాడు.