పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : హరి అసురుల శిక్షించుట

  •  
  •  
  •  

8-345-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కాలనేమి ఘోర కంఠీరవము నెక్కి
తార్క్ష్యు శిరము శూలధారఁ బొడువ
తని పోటుముట్టు రి గేల నంకించి
దానఁ జావఁ బొడిచె దైత్యవరుని.

టీకా:

కాలనేమి = కాలనేమి యనువాడు; ఘోర = భీకరమైన; కంఠీరవమున్ = సింహమును; ఎక్కి = ఎక్కి; తార్క్ష్యు = గరుడుని; శిరమున్ = తలను; శూలధారన్ = శూలము; ధారన్ = సూదికొనతో, పదునుతో; పొడువన్ = పొడవగా; అతనిన్ = అతని యొక్క; పోటుముట్టు = ఆయుధమును; హరి = విష్ణువు; కేలన్ = చేతితో; అంకించి = అందుకొని; దానన్ = దానితోనే; చావన్ = చచ్చేట్టు; పొడిచెన్ = పొడిచెను; దైత్య = రాక్షస; వరుని = ఉత్తముని.

భావము:

రాక్షస వీరుడు కాలనేమి భీకరమైన సింహాన్ని ఎక్కి వచ్చి, గరుత్మంతుని తలమీద వాడియైన బల్లెంతో కుమ్మాడు. విష్ణువు అతని ఆయుధాన్ని లాక్కొని ఆ రాక్షసుడుని చచ్చేలా పొడిచాడు.