పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : బలి ప్రతాపము

  •  
  •  
  •  

8-335-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నాకాధీశుఁ బదింట, మూఁట గజమున్, నాల్గింట గుఱ్ఱంబులన్,
కాస్త్రంబున సారథిం జొనిపె, దైత్యేంద్రుండు దా నాకస
ల్లోకాధీశుఁడు ద్రుంచి యన్నిటిని దోడ్తో నన్ని భల్లంబులన్
రాకుండన్ రిపువర్గముం దునిమె గీర్వాణారి యగ్గింపఁగన్.

టీకా:

నాకాధీశున్ = ఇంద్రుని; పదింటన్ = పదింటితోను (10); మూటన్ = మూడింటితో (3); గజమున్ = ఐరావతమును; నాల్గింటన్ = నాలుగింటితోను (4); గుఱ్ఱంబులన్ = గుఱ్ఱములను; ఏక = ఒక (1); అస్త్రంబునన్ = బాణముతోను; సారథిన్ = సారథిని; చొనిపెన్ = నాటెను; దైత్రేంద్రుండు = బలిచక్రవర్తి; తాన్ = అతను; ఆకసల్లోకాధీశుడు = ఇంద్రుడు; త్రుంచి = విరిచి; అన్నిటినిన్ = అన్నింటిని; తోడ్తోన్ = వెంటనే; అన్ని = అన్ని; భల్లంబులన్ = బాణములతోను; రాకుండన్ = చేరకుండ; రిపు = శత్రువు యొక్క; వర్గమున్ = సమూహమును; తునిమెన్ = ఖండించెను; గీర్వాణారి = బలి; అగ్గింపగన్ = మెచ్చుకొనగా.

భావము:

ఆ యుద్ధంలో దైత్యరాజు బలి చక్రవర్తి, స్వర్గాధిపతి దేవేంద్రునిమీద పది బాణాలు, ఆయన వాహనం ఐరావతంమీద మూడు బాణాలు, ఆయన రథం లాగే గుఱ్ఱాలమీద నాలుగు బాణాలు, రథసారథి మీద ఒక బాణం వేసాడు. వెంటనే ఆకాశలోకాలకు ప్రభువు అయిన దేవేంద్రుడు అ బాణాలన్నిటిని ఖండించాడు. ఆ అసుర చక్రవర్తి బలి దేవేంద్రుని పరాక్రమాన్ని మెచ్చుకున్నాడు.

8-336-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

న తూపులన్నియుఁ రమిడి శక్రుండు-
ఱికిన జోదు విన్ననువు మెఱసి
లి మహాశక్తిచేఁ ట్టిన నదియును-
తఁడు ఖండించె నత్యద్భుతముగ;
ఱి ప్రాస శూల తోరములు గైకొన్న-
దోడ్తోడ నవియును దునిమివైచె;
నంతటఁ బోక యెయ్యది వాఁడు సాగించెఁ-
దొడరి తా నదియును దురుము జేసె;

8-336.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సురభర్త విరథుఁడై తన పగఱకుఁ
గానఁబడక వివిధ పట వృత్తి
నేర్పు మెఱసి మాయ నిర్మించె మింటను
వేల్పుగములు చూచి వెఱఁగు పడఁగ.

టీకా:

తన = తన యొక్క; తూపులు = బాణములు; అన్నియున్ = సమస్తము; తరమిడి = వరసపెట్టి; శక్రుండు = ఇంద్రుడు; నఱకినన్ = నరకివేయగా; జోదు = వీరుడు (బలి); విన్న = నేర్పుగల; అనువున్ = యుక్తితో; మెఱసి = మించి; బలి = బలి; మహా = గొప్ప; శక్తిన్ = ఆయుధవిశేషమును; చేపట్టినన్ = తీసుకొనగా; అదియునున్ = దానినికూడ; అతడు = అతడు; ఖండించెన్ = ముక్కలుచేసెను; అతి = మిక్కిలి; అద్భుతముగన్ = అపూర్వముగా; మఱి = ఇంకను; ప్రాస = ఈటె; శూల = శూలము; తోమరములున్ = ఆయుధవిశేషమును; కైకొన్న = చేపట్టిన; తోడ్తోడన్ = వెంటనే; అవియునున్ = వాటినికూడ; తునిమివైచె = ముక్కలుచేసెను; అంతటన్ = అంతటితో; పోక = విడువక; ఎయ్యది = దేనిని; వాడు = అతడు; సాగించెన్ = వేసిన; తొడరి = పూని; తాన్ = అతను; అదియునున్ = దానినికూడ; తురుముజేసె = తునాతునకలుచేసెను; అసురభర్త = బలి.
విరథుడు = రథములేనివాడు; ఐ = అయ్యి; తన = తన యొక్క; పగఱ = శత్రువున; కున్ = కు; కానబడక = కనిపించకుండ; వివిధ = పలు; కపట = మాయా; వృత్తిన్ = జాలమునందు; నేర్పు = నేర్పరితనము; మెఱసి = చూపుతూ; మాయన్ = మాయను; నిర్మించెన్ = సృష్టించెను; మింటను = ఆకాశములో; వేల్పు = దేవతా; గములు = సమూహములు; చూచి = చూసి; వెఱగుపడగన్ = ఆశ్చర్యపోవునట్లు.

భావము:

దుష్టులను శిక్షించుట యందు శక్తి గల ఇంద్రుడు తన బాణాలన్నింటినీ వరసపెట్టి ఖండించగా, యోధుడైన బలి ఉపాయంతో గొప్పదయిన శక్తి ఆయుధాన్ని చేపట్టాడు. దానినికూడా ఇంద్రుడు ఆశ్చర్యంగా ఖండించాడు. పిమ్మట బలి ఈటె, శూలం, తోమర అందుకోగా, వెంటనే వాటిని కూడా ఇంద్రుడు తునాతునకలు చేసాడు. అక్కడితో ఆపకుండా, బలి వేటిని ఎక్కుపెట్టినా వాటన్నిటినీ, ఇంద్రుడు పట్టుదలగా ముక్కలు ముక్కలు చేసేశాడు. అంతట బలి రథాన్ని విడిచిపెట్టి, తన నేర్పు ప్రదర్శిస్తూ, శత్రువులకు కనబడకుండా చేసే పలు మాయలను పన్నాడు. ఆకాశంలో మాయను కల్పించాడు. దానిని చూసి దేవతా సమూహాలు భయపడిపోయాయి.

8-337-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు దానవేంద్రుని మాయావిశేషవిధానంబున సురానీకంబులపైఁ బర్వతంబులు పడియె; దావాగ్ని దందహ్యమాన తరువర్షంబులు గురిసె సటంక శిఖర నికర శిలాసారంబులు గప్పె; మహోరగ దందశూకంబులు గఱచె; వృశ్చికంబులు మీటె; వరాహ వ్యాఘ్ర సింహంబులు గదిసి విదళింపన్ దొరఁకొనియె; వనగజంబులు మట్టిమల్లాడం జొచ్చె; శూలహస్తులు దిగంబరులునై రండు రండని బలురక్కసులు శతసహస్రసంఖ్యులు భేదనచ్ఛేదన భాషణంబులు చేయం దొడంగిరి; వికృత వదనులు గదాదండధారులు నాలంబిత కేశభారులునై యనేక రాక్షస వీరులు "పోనీకు పోనీకుఁడు; తునుము తునుముం" డని వెనుతగిలిరి; పరుష గంభీర నిర్ఘాత సమేతంబులయిన జీమూత సంఘాతంబులు వాతాహతంబు లై యుప్పతిల్లి నిప్పుల కుప్పలు మంటల ప్రోవులుం గురిసె; మహాపవన విజృంభితంబైన కార్చిచ్చు ప్రళయానలంబు చందంబునం దరికొనియె; ప్రచండ ఝంఝానిల ప్రేరిత సముత్తుంగ తరంగావర్త భీషణంబయిన మహార్ణవంబు చెలియలి కట్ట దాఁటి వెల్లివిరిసిన ట్లమేయంబయి యుండె; నా సమయంబునం బ్రళయకాలంబునుం బోలె మిన్ను మన్నును రేయింబగలు నెఱుంగ రాదయ్యె; నయ్యవసరంబున.

టీకా:

ఇట్లు = ఇలా; దానవేంద్రుని = బలి యొక్క; మాయా = మాయా యందలి; విశేష = ప్రత్యేకమైన; విధానంబునన్ = విధానములవలన; సుర = దేవతా; అనీకంబుల్ = సైన్యముల; పైన్ = మీద; పర్వతంబులు = కొండలు; పడియెన్ = పడెను; దావాగ్ని = కార్చిచ్చుతో; దందహ్యమాన = కాలిపోతున్న; తరు = వృక్షముల; వర్షంబులు = వానలు; కురిసెన్ = కురిసినవి; సటంక = టంకారములతోకూడిన; శిఖర = కొండశిఖరముల; నికర = సమూహముల; శిలా = రాళ్ళ; సారంబులు = వర్షములు; కప్పె = పడెను; మహోరగ = కొండచిలువలు; దందశూకంబులున్ = పాములు; కఱచెన్ = కరచినవి; వృశ్చికంబులున్ = తేళ్ళు; మీటెన్ = కుట్టినవి; వరాహ = అడవిపందులు; వ్యాఘ్ర = పులులు; సింహంబులున్ = సింహములు; కదిసి = పైకిదూకి; విదళింపన్ = చీల్చివేయ; దొరకొనియె = మొదలిడెను; వనగజంబులున్ = అడవి ఏనుగులు; మట్టిమల్లాడ = తొక్కివేయ; చొచ్చెన్ = సాగెను; శూల = శూలములు; హస్తులు = చేతధరించినవారు; దిగంబరులున్ = వివస్త్రలు; ఐ = అయ్యి; రండురండు = రారమ్ము; అని = అని; బలు = బలిష్ఠులైన; రక్కసులు = రాక్షసులు; శత = వందలు; సహస్ర = వేల; సంఖ్యులు = సంఖ్యలుగలవారు, మంది; భేదన = తిరస్కార; ఛేదన = ఖండించెడి; భాషణంబులున్ = కేకలను; చేయన్ = పెట్టుట; తొడగిరి = మొదలిడిరి; వికృత = వికారమైన; వదనులు = ముఖముగలవారు; గదాదండ = గదాయుధములను; ధారులు = ధరించినవారు; ఆలంబిత = వేళ్ళాడుతున్న; కేశభారులునున్ = శిరోజములుగలవారు; ఐ = అయ్యి; అనేక = పలు; రాక్షస = రాక్షస; వీరులు = శూరులు; పోనీకు = పోనివ్వకండి; పోనీకుడు = పోనివ్వకండి; తునుము = నరకండి; తునుముండు = నరకండి; అని = అని; వెనుతగిలిరి = తరిమిరి; పరుష = క్రూరమైన; గంభీర = గంభీరమైన; నిర్ఘాత = పిడుగులతో; సమేతంబులు = కూడినవి; అయిన = ఐన; జీమూత = మేఘముల; సంఘాతంబులు = సమూహములు; వాతా = గాలిచేత; హతంబులు = చెదరగొట్టబడినవి; ఐ = అయ్యి; ఉప్పతిల్లి = పుట్టి; నిప్పుల = నిప్పుల; కుప్పలున్ = కుప్పలను; మంటల = మంటల; ప్రోవులున్ = పోగులు; కురిసెన్ = వర్షించెను; మహా = గొప్ప; పవన = గాలిచేత; విజృంభితంబు = ప్రేరేపింపబడినది; ఐన = అయిన; కార్చిచ్చున్ = దావాగ్ని; ప్రళయ = ప్రళయకాలపు; అనలంబు = అగ్ని; చందంబునన్ = వలె; తరికొనియెన్ = రగుల్కొనెను; ప్రచండ = తీవ్రమైన; ఝంఝా = ఝంఝం యనెడి; అనిల = గాలిచేత; ప్రేరిత = ప్రేరేపింపబడిన; సముత్తంగ = మిక్కిలి ఎత్తైన; తరంగ = అలలు; ఆవర్త = సుడిగుండములతో; భీషణంబు = భయంకరమైనది; అయిన = ఐన; మహార్ణవంబున్ = మహాసముద్రములు; చెలియలికట్ట = సరిహద్దుగట్టు; దాటి = దాటిపోయి; వెల్లివిరిసిన = ఉప్పొంగిన; అట్లు = విధముగ; అమేయంబు = అపరిమేతమైనది; అయి = అయ్యి; ఉండెన్ = ఉండెను; ఆ = ఆ; సమయంబునన్ = సమయములో; ప్రళయకాలంబును = ప్రళయకాలము; పోలెన్ = వలె; మిన్నున్ = నింగి; మన్నునున్ = నేల; రేయి = రాత్రి; పగలున్ = పగలు; ఎఱుంగన్ = తెలియ; రాదయ్యెన్ = రాకుండెను; ఆ = ఆ; అవసరంబునన్ = సమయమునందు.

భావము:

ఇలా బలిచక్రవర్తి పన్నిన ఇంద్రజాలం వలన దేవతలమీద పర్వతాలు వచ్చి పడ్డాయి, కార్చిచ్చుతో మండుతూ చెట్లు చెలరేగాయి, కొండశిఖరాల నుండి రాళ్ళ వాన వర్షించింది, పెద్దపెద్ద నాగుపాములు మీదపడి కరిచాయి, తేళ్ళు కుట్టాయి, అడవి పందులు, పులులు, సింహాలు మీదమీదకి దూకి చీల్చ బోతున్నాయి. అడవి ఏనుగులు వచ్చి పడదొక్కాయి, మహారక్కస మూకలు లక్షల సంఖ్యలలో, దిసమొలలతో శూలాలు ధరించి, “రండి రండి”, “నరుకుతాం, కోస్తాం” అంటూ కేకలు పెట్టారు. రాక్షస వీరులు ఎంతో మంది గదాదండాలు ధరించి, వికారమైన ముఖాలతో, వ్రేలాడుతున్న శిరోజాలతో “పోనివ్వకండి, పోనివ్వకండి... నరకండి, నరకండి” అంటూ వెన్నంటి తరుమసాగారు. భీకరమైన, గంభీరమైన పిడుగులతో కూడిన మేఘ సమూహాలు గాలివాలులకు చెలరేగి, నిప్పుల కుప్పలనూ, మంటల రాసులనూ కురిపించాయి. పెనుగాలుల వలన చెలరేగిన కారుచిచ్చు ప్రళయ కాలపు అగ్నివలె మండసాగింది. తీవ్రమైన తుఫాను వలన అల్లకల్లోలమైన సముద్రము అలలు, సుడిగుండాలు పెద్దపెద్దవాటితో పొంగి గట్లుదాటి పొర్లసాగింది. అప్పుడు, ప్రళయకాలమా అన్నట్లు నింగీ, నేలా,రాత్రీ, పగలూ తేడా తెలియరాకుండా పోయింది.

8-338-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సురేంద్రుని బహుతర
మాయాజాలంబులకును మా ఱెఱుఁగక వ
జ్రాయుధ ముఖరాదిత్యుల
పాయంబును బొంది చిక్కుడిరి నరేంద్రా!

టీకా:

ఆ = ఆ; అసురేంద్రుని = రాక్షసరాజు యొక్క; బహుతర = చాలా ఎక్కువ యైన; మాయా = మాయల; జాలంబుల్ = సమూహముల; కునున్ = కు; మాఱు = విరుగుడు; ఎఱుగక = తెలియక; వజ్రాయుధ = ఇంద్రుడు; ముఖర = మొదలగు; ఆదిత్యులు = ద్వాదశాదిత్యులు; అపాయంబునున్ = ఆపదలు; పొంది = పొంది; చిక్కుపడిరి = చిక్కులపాలైరి; నరేంద్ర = రాజా.

భావము:

ఓ పరీక్షిన్మహారాజా! ఆ రాక్షస రాజేంద్రుడు బలి పన్నిన రకరకాల మాయా జాలాలకు విరుగుడు తెలియని వజ్రాయుధధారి అయిన ఇంద్రుడు మున్నగు ఆదిత్యులు దిక్కుతోచక చిక్కులలో పడ్డారు.

8-339-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అప్పుడు

టీకా:

అప్పుడు = ఆ సమయమునందు.

భావము:

ఆ సమయంలో దేవతలు.

8-340-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"ఇయ్యసురుల చేఁ జిక్కితి
మెయ్యది దెరు? వెందుఁ జొత్తుఁ? మిటు పొలయఁ గదే
య్యా! దేవ! జనార్దన!
కుయ్యో! మొఱ్ఱో!" యటంచుఁ గూయిడి రమరుల్

టీకా:

ఈ = ఈ; అసురుల్ = రాక్షసుల; చేన్ = చేతిలో; చిక్కితిమి = చిక్కుకొంటిమి; ఎయ్యది = ఏది; తెరువు = దారి; ఎందున్ = దేనియందు; చొత్తుము = దాగెదము; ఇటు = ఇక్కడకు; పొలయగదే = రమ్ము; అయ్యా = తండ్రీ; దేవ = దేవుడా; జనార్దన = హరి; కుయ్యో = కుయ్యో; మొఱ్ఱో = మొఱ్ఱో; అటంచున్ = అనుచు; కూయిడిరి = మొరపెట్టిరి; అమరుల్ = దేవతలు.

భావము:

“దేవా! జనార్దనా! ఈ రాక్షసరాజు మాయాజాలాలలో చిక్కుకుపోయాము. ఇప్పుడు మాకు దారేది? ఇప్పుడు ఎక్కడకి పోవాలి? ఇక్కడకి రావయ్యా! మమ్ము కాపాడవయ్యా! కుయ్యో మొఱ్ఱో” అంటూ విష్ణువునకు మొరపెట్టుకున్నారు.