పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : సురాసుర యుద్ధము

  •  
  •  
  •  

8-330-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రుదై కామగమై మయాసురకృతంబై లోకితాలోక్యమై
శస్త్రాస్త్ర సమేతమై తరళమై వైహాయసంబై మహా
సుయోధాన్వితమైన యానమున సంశోభిల్లెఁ బూర్ణేందు సు
స్థికాంతిన్ బలి చామరధ్వజ చమూదీప్తస్థితిన్ ముందటన్.

టీకా:

అరుదు = అపూర్వమైనది; ఐ = అయ్యి; కామగము = కోరినట్లుపయనించెడిది; ఐ = అయ్యి; మయ = మయుడు యనెడి; అసుర = రాక్షసునిచే; కృతంబు = చేయబడినది; ఐ = అయ్యి; లోకిత = చూపులకు; అలోక్యము = కనబడనిది; ఐ = అయ్యి; వర = శ్రేష్ఠమైన; శస్త్ర = శస్త్రములు; అస్త్ర = అస్త్రములు; సమేతము = కలిగినది; ఐ = అయ్యి; తరళము = ప్రకాశించునది; ఐ = అయ్యి; వైహాయసంబు = ఆకాశలోవెళ్ళునది; ఐ = అయ్యి; మహా = గొప్ప; అసుర = రాక్షస; యోధ = వీరులతో; ఆన్వితము = కూడినది; ఐన = అయిన; యానమునన్ = వాహనమునందు; సంశోభిల్లెన్ = మిక్కిలి శోభించెను; పూర్ణ = నిండు; ఇందు = చంద్రుని; సుస్థిర = నిలకడైన; కాంతిన్ = ప్రకాశముతో; బలి = బలి; చామర = వింజామరలతో; ధ్వజ = జండాలతో; చమూ = సైన్యముల; దీప్తస్థితిన్ = ప్రకాశించుతుండగా; ముందటన్ = ముందుపక్కన.

భావము:

నిండు పున్నమి నాటి చంద్రునికి సాటివచ్చే ప్రకాశంతో బలిచక్రవర్తి, మయాసురు డంతటి వానిచే నిర్మింపబడినది, చూపులకు అందనిది, ఎన్నో విశిష్ట శస్త్ర అస్త్రాది ఆయుధాలు కలది, ఆకాశంలో కూడా వెళ్ళగలది. గొప్ప గొప్ప రాక్షస యోధులు ఎందరో సిద్ధంగా గల గొప్ప వాహనంపై బయలుదేరాడు. అలా వస్తున్న బలిచక్రవర్తి వాహనం ముందు వింజామరలతో, జెండాలతో ప్రకాశిస్తున్న దానవ సైన్యాలు నడుస్తున్నాయి.