పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : సురాసుర యుద్ధము

  •  
  •  
  •  

8-329-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

న్యులు వైరోచని శత
న్యుప్రముఖులు మదాభిమానులు దమలో
న్యోన్యరణము బాహా
సిన్యాసంబులను బేర్చి చేసిరి కడిమిన్.

టీకా:

ధన్యులు = పుణ్యులు; వైరోచని = బలిచక్రవర్తి (వైరోచనుడు = ప్రహ్లాదుని కొడుకు అయిన విరోచనుని పుత్రుడు, విశిష్టమైన ప్రకాశం కలవాడు, బలిచక్రవర్తి); శతమన్యు = ఇంద్రుడు (శతమన్యుడు = శత (నూరు, 100) యజ్ఞములు చేసినవాడు, ఇంద్రుడు); ప్రముఖులు = మొదలగువారు; మద = మదము; అభిమానులు = గర్వములుగలవారు; తమ = వారి; లోన్ = లోపల; అన్యోన్య = ఒకరితోఒకరుచేయు; రణము = యుద్ధము; బాహ = చేతి; అసి = కత్తి; న్యాసంబులన్ = విన్యాసములతో; పేర్చి = అతిశయించి; చేసిరి = చేసితిరి; కడిమిన్ = పరాక్రమముతో.

భావము:

విరోచనుని (ప్రహ్లాదుని కొడుకు) కొడుకు అయిన బలిచక్రవర్తి, నూరు యజ్ఞములు చేసి పదవి పొందిన ఇంద్రుడు మొదలైన బలవంతులు ఖడ్గాలు చేబూని మదించిన స్వాభిమానాలు కలవారై, చెలరేగి బాహాబాహి పోరాటాలు సాగించారు.
ప్రాస -న్యూనఫలదాయక పోరాటాలు. కనుక కఠినతరమైన “న్య” కార ప్రాస.