పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : సురాసుర యుద్ధము

  •  
  •  
  •  

8-328-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శుద్ధముగ సురల కమృతము
సిద్ధించిన నసుర వరులు సిడిముడిపడుచున్
క్రుద్ధులు నానాయుధ స
న్నద్ధులు నయి యుద్ధమునకు డచిరి బలిమిన్.

టీకా:

శుద్ధముగన్ = సంపూర్ణముగా; సురల్ = దేవతల; కున్ = కు; అమృతమున్ = అమృతమును; సిద్ధించినన్ = సమకూరినందువల్ల; అసుర = రాక్షస; వరులు = వీరులు; సిడిముడి = చీకాకు; పడుచున్ = చెందుతూ; క్రుద్ధులు = కోపముగలవారు; నానా = వివిధ; ఆయుధ = ఆయుధములతో; సన్నద్ధులు = సంసిద్ధమైనవారు; అయి = ఐ; యుద్ధమున్ = పోరుట; కున్ = కు; నడచిరి = బయలుదేరిరి; బలిమిన్ = బలవంతముగా.

భావము:

దేవతలకే మొత్తం అమృతం అంతా చిక్కడం వలన రాక్షస వీరులకు చీకాకు పుట్టింది. వారు అనేక రకాల ఆయుధాలతో సేనలతో యుద్ధానికి సిద్ధపడి బయలుదేరారు.
శైలి -అమృతం సాధించటంలో కష్టం, ఆ కష్టానికి ఫలం దక్కనందున చీకాకు మనసుతో పెట్టుకున్న కృద్ధత తీవ్రతను కష్టసాధ్యమైన “ద్ధ” కార ప్రాసతో సూచించిన తీరు బావుంది.