పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : రాహువు వృత్తాంతము

  •  
  •  
  •  

8-327-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శోధించి జలధి నమృతము
సాధించి నిలింపవైరి క్షుర్గతులన్
రోధించి సురల కిడి హరి
బోధించి ఖగేంద్రు నెక్కి పోయె నరేంద్రా!

టీకా:

శోధించి = కష్టపడిప్రయత్నించి; జలధిన్ = సముద్రమునందు; అమృతమున్ = అమృతమును; సాధించి = సంపాదించి; నిలింపవైరిన్ = రాక్షసులను; చక్షుః = చూపుల; గతులన్ = నడకలతోనే; రోధించి = నిరోధించి; సురల్ = దేవతల; కున్ = కు; ఇడి = ఇచ్చి; హరి = విష్ణుమూర్తి; బోధించి = తెలియజెప్పి; ఖగేంద్రున్ = గరుత్మంతుని; ఎక్కి = ఎక్కి; పోయెన్ = వెళ్ళిపోయెను; నరేంద్రా = రాజా.

భావము:

ఓ పరీక్షిన్మహారాజా! రాక్షసులను తన కంటి చూపులతోనే నిరోధించి, కష్టపడి సాధించిన అమృతాన్ని, దేవతలకు ఇచ్చి విష్ణుమూర్తి గరుత్మంతుని ఎక్కి వెళ్ళిపోయాడు.