పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : రాహువు వృత్తాంతము

  •  
  •  
  •  

8-324-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

బొట్టుఁ జిక్క కుండఁగ
ల సుధారసము నమర సంఘంబులకుం
బ్రటించి పోసి హరి దన
సురాకృతిఁ దాల్చె నసుర శూరులు బెగడన్.

టీకా:

ఒక = ఒక్క; బొట్టున్ = చుక్కకూడ; చిక్కకుండగన్ = మిగలకుండ; సకల = అంత; సుధా = అమృతపు; రసమున్ = రసమును; అమర = దేవతా; సంఘంబుల్ = సమూహముల; కున్ = కు; ప్రకటించి = బాహాటముగా; పోసి = పోసి; హరి = విష్ణుమూర్తి; తన = తన యొక్క; సుకర = సాధువైన; ఆకృతిన్ = రూపును; తాల్చెన్ = ధరించెను; అసుర = రాక్షస; శూరులు = వీరులు; బెగడన్ = బెదిరిపోగ.

భావము:

విష్ణుమూర్తి ఒక్క చుక్క కూడా రాక్షసులకు మిగల్చకుండా, అమృతం అంతా దేవతలకు బాహాటంగా పోసి, మోహినీ రూపాన్ని వదలిపెట్టి నిజాకారాన్ని ధరించాడు. ఇదంతా చూస్తున్న రాక్షస వీరులు దుఃఖించారు.