పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : రాహువు వృత్తాంతము

  •  
  •  
  •  

8-323-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

జుఁడు వాని శిరము నంబరవీథిని
గ్రహము జేసి పెట్టి గారవించె;
వాఁడు పర్వములను వైరంబు దప్పక
భానుచంద్రములను ట్టు చుండు.

టీకా:

అజుడు = బ్రహ్మదేవుడు; వాని = అతని; శిరమున్ = తలను; అంబర = గగన; వీథిన్ = తలమున; గ్రహమున్ = గ్రహముగా; చేసి = చేసి; పెట్టి = ఉంచి; గారవించె = గౌరవించెను; వాడున్ = అతడు; పర్వములను = అమావాస్యపూర్ణిమలను; వైరంబున్ = పగతో; తప్పక = వదలకుండ; భాను = సూర్యుడు; చంద్రములన్ = చంద్రుడులను; పట్టుచుండు = పట్టుచుండును.

భావము:

అలా అమరత్వం పొందిన రాహువు శిరస్సును బ్రహ్మదేవుడు గౌరవించి గ్రహంగా చేసి ఆకాశంలో నిలబెట్టాడు. రాహుగ్రహం ఆ పగను వదలకుండా, అమావాస్య, పూర్ణిమల్లో సూర్య చంద్రులను నేటికీ పట్టుకుంటోంది.