పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : రాహువు వృత్తాంతము

  •  
  •  
  •  

8-322-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రవ్రాతములోన జొచ్చి దివిజుండై రాహు పీయూష పా
ము జేయం గని చంద్రభాస్కరులు సన్నల్ చేయ నారాయణుం
రారాతిశిరంబు చక్రహతిఁ దున్మాడెన్ సుధాసిక్త మై
రత్వంబును జెందె మూర్ధముఁ దదన్యాంగంబు నేలం బడెన్.

టీకా:

అమర = దేవతల; వ్రాతము = సమూహము; లోనన్ = అందు; జొచ్చి = ప్రవేశించి; దివిజుండు = దేవతారూపుడు; ఐ = అయ్యి; రాహు = రాహువు; పీయూష = అమృత; పానమున్ = తాగుటను; చేయన్ = చేయుచుండగ; కని = చూసి; చంద్ర = చంద్రుడు; భాస్కరులు = సూర్యులు; సన్నల్ = సైగలు; చేయన్ = చేయగా; నారాయణుండు = విష్ణుమూర్తి; అమరారాతి = రాక్షసుని; శిరంబున్ = తలను; చక్ర = చక్రాయుధము యొక్క; హతిన్ = దెబ్బచేత; తున్మాడెన్ = నరకివేసెను; సుధా = అమృతముచేత; సిక్తము = తడసినది; ఐ = అగుటచేత; అమరత్వంబున్ = చావులేకపోవుటను; చెందెన్ = పొందినది; మూర్ధమున్ = తల; తత్ = అతని; అన్య = మిగిలిన; అంగంబున్ = దేహము; నేలన్ = భూమిపైన; పడెన్ = పడిపోయెను.

భావము:

రాహువు దేవతలలో రహస్యంగా కలిసిపోయి దేవతల రూపు ధరించి అమృతం తాగుతుండగా సూర్యచంద్రులు చూసారు. చూసి మోహినికి సైగలు చేసారు. వెంటనే విష్ణువు చక్రాయుధంతో రాహువు తల ఖండించాడు. అమృతం ఆనటం వలన, రాహువు తల నిర్జీవం కాలేదు. అమరత్వం పొందింది. మొండెం నేలపై కూలిపోయింది.