పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : అమృతము పంచుట

  •  
  •  
  •  

8-314-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

భాసుర కుండల భాసిత
నాసాముఖ కర్ణ గండ యనాంచల యై
శ్రీతి యగు సతిఁ గని దే
వాసుర యూథంబు మోహ మందె నరేంద్రా!

టీకా:

భాసుర = కాంతివంతమైన; కుండల = చెవికుండలములచే; భాసిత = ప్రకాశింపచేయబడిన; నాసా = ముక్కు; ముక్కు = ముక్కు; కర్ణ = చెవులు; గండ = చెక్కిళ్ళు; నయనాంచల = కనుకొనలు గలది; ఐ = అయ్యి; శ్రీసతి = లక్ష్మీదేవి; అగు = అయిన; సతిన్ = సతీదేవిని; కని = చూసి; దేవా = దేవతల; అసుర = రాక్షస; యూథంబున్ = సమూహము; మోహము = మాయలో; అందెన్ = పడెను; నరేంద్రా = రాజా.

భావము:

పరీక్షిత్తూ! రాజా! ఆ మోహినీ అవతారం, ధరించిన కర్ణాభరణాల తళతళ మెరుపులు, ఆమె ముక్కుకు, ముఖానికి, చెవులకు, చెక్కిళ్ళకు, కనుగొనలకు మనోహరంగా వ్యాపిస్తున్నాయి. అలా లక్ష్మీదేవితో సాటిరాగల ఆ అందగత్తెను చూసిన దేవతలకు, రాక్షసులకు అందరికీ మనసు చెదిరి పోయింది.