పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : అమృతము పంచుట

  •  
  •  
  •  

8-313-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శ్రోణీభర కుచయుగ భర
వేణీభరములను డస్సి వివిధాభరణ
క్వా యయి యువిద వచ్చెను
బాణి సరోజమున నమృతభాండముఁ గొంచున్

టీకా:

శ్రోణీ = కటి; భర = బరువుతోను; కుచ = స్తనముల; యుగ = ద్వయము; భర = బరువుతోను; వేణీ = శిరోజముల; భరములను = బరువుతోను; డస్సి = అలసిపోయి; వివిధ = అనేకరకముల; ఆభరణ = నగల యొక్క; క్వాణ = ధ్వనులుగలది; అయి = ఐ; ఉవిద = మగువ; వచ్చెను = అరుదెంచెను; పాణి = చేతులు యనెడి; సరోజమునన్ = పద్మమునందు; అమృత = అమృతపు; భాండమున్ = పాత్రను; కొంచున్ = తీసుకొని.

భావము:

అప్పుడు, కటిభారంతో, స్తనాలభారంతో, శిరోజాలభారంతో చిక్కిన చక్కనమ్మ జగన్మోహిని, తన పద్మం వంటి చేతిలో అమృతకలశాన్ని పట్టుకుని ఒయ్యారంగా వచ్చింది. ఆమె ధరించిన రకరకాల ఆభరణాలు సవ్వళ్ళు చేస్తున్నాయి.