పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : జగన్మోహిని వర్ణన

  •  
  •  
  •  

8-309-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లుకులు మధురసధారలు
లఁపులు నానా ప్రకార దావానలముల్
చెలుములు సాలావృకములు
చెలువల నమ్ముటలు వేదసిద్ధాంతములే?

టీకా:

పలుకులు = మాటలు; మధు = తేనెల వంటి; రస = రుచులు; ధారలు = కారునవి; తలపులు = ఆలోచనలు; నానా = అనేక; ప్రకార = విధములైన; దావానలముల్ = కార్చిచ్చులు; చెలుములు = స్నేహములు; సాలావృకములు = నక్కలు; చెలువలన్ = అందగత్తెలను; నమ్ముటలు = విశ్వసించుట; వేదసిద్ధాంతములే = ప్రమాణికములా, కాదు.

భావము:

అందగత్తెల మాటలు తియ్యనైన తేనెలు జాలువారుతూ ఉంటాయి. వారి ఆలోచనలు అనేక విధాలైన కార్చిచ్చులు, వారి స్నేహాలు తోడేళ్ళవంటివి. అటువంటివారిని విశ్వశించడాలు అంగీకారమైనవి కావు.