పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : జగన్మోహిని వర్ణన

  •  
  •  
  •  

8-301.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మరఁ గుండల కేయూర హార కంక
ణాదు లేపార మంజీర నాద మొప్ప
ల్ల నవ్వులఁ బద్మదళాక్షుఁ డసుర
తుల నడగింప నాఁడు రూపంబుఁ దాల్చి.

టీకా:

మెత్తని = సున్నితమైన; అడుగులన్ = అడుగులు; మెఱుగారు = నిగనిగలాడెడి; జానువుల్ = మోకాళ్ళు; అరటి = అరటి; కంబములన్ = స్తంభములకు; తోడు = సమానము; అగు = అయ్యెడి; తొడలు = తొడలు; ఘనము = మిక్కిలి పెద్దవి; అగు = అయిన; జఘనంబున్ = పిరుదులు; లేత = సన్నని; నడుమును = నడుము; పల్లవ = చిగురువంటి; అరుణ = ఎఱ్ఱని; కాంతి = ప్రకాశముగల; పాణి = అరచేతుల; యుగమున్ = జంట (2); కడు = మిక్కిలి; దొడ్డ = పెద్దవైన; పాలిండ్లున్ = స్తనములు; కంబు = శంఖమువంటి; కంఠంబును = కంఠము; బింబ = దొండపండువంటి; అధరమున్ = కిందిపెదవి; చంద్రబింబ = చంద్రబింబమువంటి; ముఖము = మొగము; తెలి = తెల్లని; కన్ను = కళ్ళ; గవయునున్ = జంట (2); అలి = తుమ్మెదలవంటి; కుంతలంబును = శిరోజములు; బాలేందు = నెలవంక; సన్నిభ = సరపోలెడి; ఫాలతలము = నుదురు; అమరన్ = ఒప్పారియుండగా; కుండల = చెవికుండలములు.
కేయూర = బాహుపురులు; హార = హారములు; కంకణ = కంకణములు; ఆదులు = మున్నగునవి; ఏపార = అతిశయించగా; మంజీర = కాలి అందెల; నాదము = రవములు; ఒప్పన్ = చక్కగనుండగా; నల్ల = చిరు; నవ్వులన్ = నవ్వులతో; పద్మదళాక్షుడు = విష్ణుమూర్తి; అసుర = రాక్షస; పతులన్ = రాజులను; అడగింపన్ = అణచివేయుటకు; ఆడు = స్త్రీ; రూపంబున్ = ఆకృతిని; తాల్చి = ధరించి.

భావము:

ఈలోగా విష్ణుమూర్తి తనలో తాను చిరునవ్వులు నవ్వుకున్నాడు. రాక్షస వీరులను అణచడానికి మాయా మోహినీ రూపం ధరించాడు. ఆ మోహినికి మెత్తని అడుగులు, నిగనిగ మెరసే మోకాళ్ళు, అరటిబోదెలవంటి తొడలు, పెద్ద పెద్ద పిరుదులు, బాగా సున్నితమైన నడుము, చిగురుటాకుల వంటి ఎఱ్ఱని అరచేతులు, పెద్ద వక్షోజాలు, శంఖంవంటి కంఠం, దొండపండు లాంటి పెదవి, చంద్రబింబం వంటి ముఖము, తెల్లని కన్నులు రెండు, నల్లని తుమ్మెదలవంటి శిరోజాలు, నెలవంక వంటి నుదురు చక్కగా అమరి ఉన్నాయి. ఆమె అలంకరించుకున్న చెవిలోలకులు, బాహుపురులు, హారాలు, కంకణాలు, వాటిని మించిన చిరు సవ్వళ్ళు చేసే కాలి అందెలు ఎంతో శోభిస్తున్నాయి.