పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : ధన్వంతర్యామృత జననము

  •  
  •  
  •  

8-297-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

చావులేని మందు క్కఁగ మన కబ్బె
నుచుఁ గడవ నసుర లాఁచి కొనిన
వెచి సురలు హరికి మొలు పెట్టిరి సుధా
పూర్ణఘటము పోయెఁ బోయె ననుచు.

టీకా:

చావు = మరణము; లేని = లేని; మందు = ఔషధము; చక్కగ = చక్కగ; మన = మన; కున్ = కు; అబ్బె = లభించెను; అనుచున్ = అనుచు; కడవన్ = పాత్రను; అసురలు = రాక్షసులు; ఆచికొనిన = లాక్కొనిపోగా, అపహరించగా; వెఱచి = భయపడి; సురలు = దేవతలు; హరి = విష్ణుని; కిన్ = కి; మొఱలుపెట్టిరి = ఆర్తధ్వానములుచేసిరి; సుధా = అమృతముతో; పూర్ణ = నిండిన; ఘటమున్ = పాత్ర; పోయెఁబోయెన్ = పొయింది; అనుచు = అనుచు.

భావము:

“మనకు చావు లేకుండా చేసే మందు సులువుగా దొరికేసింది” అంటూ అసురులు అమృత భాండాన్ని లాక్కుపోయారు. దేవతలు భయంతో “అమృతం నిండా ఉన్న కుండ పోయింది, పోయింది” అంటూ విష్ణుమూర్తికి మొరపెట్టుకున్నారు.