పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : ధన్వంతర్యామృత జననము

  •  
  •  
  •  

8-295-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తనిచేత నున్న మృత కుంభము చూచి
కెరలు పొడిచి సురలఁ గికురుపెట్టి
పుచ్చికొనిరి యసుర పుంగవు లెల్లను
మాఱులేని బలిమి మానవేంద్ర!

టీకా:

అతని = అతని యొక్క; చేతన్ = చేతిలో; ఉన్న = ఉన్నట్టి; అమృత = అమృతపు; కుంభమున్ = పాత్రను; చూచి = చూసి; కెరలుపొడిచి = విజృంభించి; సురలన్ = దేవతలను; కికురుపెట్టి = వంచించి; పుచ్చుకొనిరి = తీసుకొనిరి; అసుర = రాక్షసులలో; పుంగవులున్ = శ్రేష్ఠులు; ఎల్లన్ = అందరును; మాఱులేని = తిరుగులేని; బలిమిన్ = బలముతో; మానవేంద్ర = రాజ.

భావము:

పరీక్షన్మహారాజా! ధన్వంతరి చేతిలోని అమృతకలశాన్ని రాక్షసులు చూసారు. దేవతలను త్రోసిపుచ్చి, సాటిలేని బలంతో చెలరేగి, ఎగబడి ఆయన చేతులలోని కలశాన్ని లాక్కున్నారు.