పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : లక్ష్మీదేవి హరిని వరించుట

  •  
  •  
  •  

8-288-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మ్రోసెన్ శంఖ మృదంగ వేణురవముల్ మున్నాడి; పెంజీఁకటుల్
వాసెన్; నర్తన గాన లీలల సురల్ భాసిల్లి; రార్యుల్ జగ
ద్వాసుల్ విష్ణుని బ్రహ్మ రుద్ర ముఖరుల్ ల్లింగమంత్రంబులం
బ్రాక్తిన్ వినుతించి రుల్లసిత పుష్పశ్రేణి వర్షించుచున్.

టీకా:

మ్రోసెన్ = మోగినవి; శంఖ = శంఖముల; మృదంగ = మృదంగముల; వేణు = పిల్లనగ్రోవుల; రవముల్ = శబ్దములు; మున్నాడి = ముందుగా; పెంజీకటుల్ = పెను చీకట్లు; వాసెన్ = తొలగిపోయినవి; నర్తన = నాట్యములు; గాన = సంగీత; లీలలన్ = క్రీడలను; సురల్ = దేవతలు; భాసిల్లిరి = విలసిల్లిరి; ఆర్యుల్ = పూజ్యులు; జగత్ = లోకములలోని; వాసుల్ = జనులు; విష్ణుని = హరిని; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; రుద్ర = శంకరుడు; ముఖరుల్ = మున్నగువారు; తత్ = అతని; లింగ = అవ్యక్తప్రకృతిని; మంత్రంబులన్ = మంత్రములతో; ప్రాసక్తిన్ = ప్రస్తావించుచు; వినుతించిరి = స్తోత్రముచేసిరి; ఉల్లసిత = ప్రకాశితములగు; పుష్ప = పూల; శ్రేణిన్ = ధారలను; వర్షించుచున్ = కురిపించుచు.

భావము:

లక్ష్మీదేవి నారాయణుని చేరిన కల్యాణ సమయంలో, ముందు శంఖ, మృదంగ ధ్వానాలు, మురళీరవాలు మ్రోగాయి. పెనుచీకట్లు తొలగిపోయాయి. ఆటపాటల వేడుకలతో దేవతలు విలసిల్లారు. సర్వలోక పూజ్యులు, బ్రహ్మాది దేవతలు విష్ణునామాంకితాలైన మంత్రాలతో స్తోత్రాలు చేశారు.