పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : లక్ష్మీదేవి హరిని వరించుట

  •  
  •  
  •  

8-285-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రి చూచిన సిరి చూడదు
సిరి చూచిన హరియుఁ జూఁడ సిగ్గును బొందున్
రియును సిరియునుఁ దమలో
రిఁజూపులఁజూడ మరుఁడు సందడి పెట్టెన్.

టీకా:

హరి = విష్ణుమూర్తి; చూచినన్ = చూసినచో; సిరి = లక్ష్మీదేవి; చూడదు = చూడదు; సిరి = శ్రీదేవి; చూచినన్ = చూసినచో; హరియున్ = విష్ణువు; చూడన్ = చూచుటకు; సిగ్గునున్ = లజ్జను; పొందును = చెందును; హరియును = విష్ణువు; సిరియునున్ = శ్రీదేవి; తమలోన్ = వారిలోవారు; సరిచూపులన్ = సమానచూపులతో; చూడన్ = చూచుచుండగ; మరుడు = మన్మథుడు; సందడి = తొందర; పెట్టెన్ = పెట్టెను.

భావము:

విష్ణుమూర్తి తన కేసి చూస్తే లక్ష్మి చూసేది కాదు. లక్ష్మీదేవి తనని చూస్తే విష్ణువు చూడటానికి సిగ్గు పడేవాడు. లక్ష్మీ విష్ణువు ఒకరినొకరు సరిసమానంగా చూసుకునేలా మన్మథుడు తొందరలు పెట్టాడు.