పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : లక్ష్మీదేవి హరిని వరించుట

  •  
  •  
  •  

8-284-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మోహరుచుల వలన ముద్దియ దల యెత్తు
సిగ్గువలన బాల శిరము వంచు
నింతి వెఱపు వలన నెత్తదు వంపదు
నదు ముఖము ప్రాణయితుఁ జూచి.

టీకా:

మోహ = మిక్కిలిప్రేమ; రుచుల = ఇచ్చల; వలన = వలన; ముద్దియ = అందగత్తె; తల = తలను; ఎత్తున్ = ఎత్తును; సిగ్గు = లజ్జ; వలన = వలన; బాల = పిల్ల; శిరము = తలను; వంచున్ = దించును; ఇంతి = స్త్రీ; వెఱపు = బెరకు; వలన = వలన; ఎత్తదు = పైకెత్తదు; వంపదు = కిందకిదింపదు; తనదు = తన యొక్క; ముఖమున్ = మోమును; ప్రాణ = ప్రాణముతో సమానమైన; దయితున్ = ప్రియుని; చూచి = చూసి.

భావము:

ఇందిర పెల్లుబికిన ప్రేమతో తల ఎత్తింది. కానీ మొలకలెత్తిన సిగ్గుతో తల వంచింది. తన ప్రాణవల్లభుడైన విష్ణుని చూడడం వలన కలిగిన తొట్రుపాటు వలన ఆమె మోము ఎత్తనూ ఎత్తదు, దించనూ దించదు.