పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : లక్ష్మీదేవి హరిని వరించుట

  •  
  •  
  •  

8-283-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇందీవర దామమున ము
కుందునిఁ బూజించి తనకుఁ గూడి వసింపన్
మందిరముగఁ దద్వక్షము
నందంద సలజ్జదృష్టి నాలోకించెన్.

టీకా:

ఇందీవర = కలువల; దామమునన్ = దండతో; ముకుందుని = విష్ణుని; పూజించి = సత్కరించి; తన = తన; కున్ = కు; కూడి = చేరి; వసింపన్ = ఉండుటకు; మందిరముగన్ = నివాసముగా; తత్ = అతని; వక్షమున్ = వక్షస్థలమును; అందంద = మరీమరీ; సలజ్జన్ = సిగ్గుతోకూడిన; దృష్టిన్ = చూపులతో; ఆలోకించెను = చూసెను.

భావము:

లక్ష్మీదేవి కలువ పూలమాలతో మోక్షదాయకుడైన విష్ణువును వరించింది. తాను చేరి నివసించడానికి ఆయన వక్షస్థలాన్ని ఎన్నుకొని, సిగ్గుతో కూడిన చూపులతో మరీ మరీ చూసింది.