పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : లక్ష్మీదేవి హరిని వరించుట

  •  
  •  
  •  

8-280.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కొన్నిచోట్ల కామగుణ గరిష్ఠంబులు
క్రోధ సంయుతములుఁ గొన్ని యెడలు
గొన్ని మోహలోభకుంఠితంబులుఁ గొన్ని
ప్రమద మత్సరాను భావకములు."

టీకా:

ఐదువన్ = ముత్తైదువను; ఐ = అయ్యి; ఉండన్ = ఉండుట; అలవడదు = వీలుండదు; ఒకచోట = ఒకచోట; ఒకచోట = ఒకచోట; సవితి = సపత్ని; తోన్ = తోటి; ఓర్వన్ = భరింప; రాదు = వీలుకాదు; తగన్ = తగ; ఒకచోట = ఒకచోట; సంతత = శాశ్వతమైన; వైభవంబున్ = వైభవములుగలది; కాదు = కాదు; ఒకచోట = ఒకచోట; వేడిమిన్ = వేడివలన; ఉండన్ = ఉండుటకు; పోలదు = సాధ్యముకాదు; ఒకచోట = ఒకచోట; కరుణ = దయ; లేదు = లేదు; ఒక్కింతన్ = కొంచముకూడ; వెదకినన్ = వెతికిచూసిన; ఒకచోట = ఒకచోట; డగ్గఱి = దగ్గరచేరి; ఉండన్ = ఉండి; బెట్టన్ = పోవుటకు; ఎఱయంగ = తెలిసికొన; ఒకచోట = ఒకచోట; నిలుకడ = స్థిరత్వము; చాలదు = సరిపోదు; చర్చింపన్ = తరచిచూసినచో; ఒకచోట = ఒకచోట; జడత = అధికమైనజడత్వము; కలదు = ఉన్నది.
కొన్ని = కొన్ని; చోట్లన్ = చోటులలో; కామగుణ = కామగుణ; గరిష్టంబులు = ప్రబలముగాగలవి; క్రోధ = కోపముతో; సంయుతములున్ = కూడినవి; కొన్ని = కొన్ని; ఎడలు = చోట్లు; కొన్ని = కొన్ని; మోహ = మోహము; లోభ = లోభములతో; అకుంఠితంబులున్ = అధికముగాగలవి; కొన్ని = కొన్ని; ప్రమద = అధికగర్వము; మత్సర = మాత్సర్యముల; అనుభావకములు = ప్రభావములుగలవి.

భావము:

ఒకచోట పునిస్త్రీగా ఉండటానికి వీలుండదు. (మన్మథుడు విగతదేహుడు). ఒకచోట సవతి వల్ల ఓర్చుకోడం కష్టం. (శివుడు అర్థనారీశ్వరుడు). ఒక చోట వైభవం స్థిరంగా ఉండదు. (ఇంద్రుడికి రాక్షసులతో యుద్ధాలు ఓడటం). ఒకచోట తాపం భరించలేము. (సూర్యుడు). ఒకచోట ఎంత వెతికినా దయ కనిపించదు. (యముడు). ఒకచోట దగ్గరగా ఉండలేము. (అగ్ని), ఒకచోట నిలకడలేదు. (వాయుదేవుడు). ఒకచోట జడత్వం ఎక్కువ. (వరుణుడు). కొన్ని చోట్ల కామగుణం ప్రబలంగా ఉంటుంది. (గంధర్వులు). కొన్ని చోట్లు క్రోధపూరితములు. (రుద్రుడు). కొన్నిచోట్ల మోహము లోభము నిండిన మొరటుదనం ఉంటుంది. కొన్ని చోట్ల గర్వము, మచ్చరము కూడి ఉంటాయి. (రాక్షసులు). అని లక్ష్మీదేవి అక్కడ ఉన్న గొప్పవారిని తరచి చూసి భావిస్తున్నది.
ఈ పద్యంలో జాలువారుతున్న కవితాధార, దానికి తగ్గ తేనెకన్నా మధురమైన శైలి, శైలితో నిండుగా పాత్రపోషణ ఎంతో చక్కగా సహజ అలంకారంగా అమరాయి.