పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : లక్ష్మీదేవి పుట్టుట

  •  
  •  
  •  

8-278-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

న్నులు నా చన్నులు
నా కురు లా పిఱుఁదు నడుము నా ముఖమా న
వ్యాకారముఁ గని వేల్పులు
చీకాకునఁ బడిరి కలఁగి శ్రీహరి దక్కన్.

టీకా:

ఆ = ఆ; కన్నులు = కళ్ళు; ఆ = ఆ; చన్నులున్ = స్తనములు; ఆ = ఆ; కురులున్ = శిరోజములు; ఆ = ఆ; పిఱుదున్ = పిరుదులు; నడుమున్ = నడుము; ఆ = ఆ; ముఖము = మోము; ఆ = ఆ; నవ్య = నుతింపదగిన; ఆకారమున్ = రూపమును; కని = చూసి; వేల్పులు = దేవతలు; చీకాకునన్ = శ్రమము, నలకువ; పడిరి = పొందిరి; కలగి = కలతచెంది; శ్రీహరి = విష్ణుమూర్తి; తక్కన్ = తప్పించి.

భావము:

అపురూపమైన ఆకారం కలిగినామె ఆ మహాలక్ష్మి. నవనవోన్మేష స్వరూపాలు కలిగిన ఆమె కళ్ళు, ఉరోజాలు, శిరోజాలు, పిరుదులు, నడుము, ముఖముచూసి, ఒక్క శ్రీమహావిష్ణువు తప్ప దేవతలు అందరూ ధైర్యాన్ని కోల్పోయి తబ్బిబ్బు పడ్డారు.