పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : లక్ష్మీదేవి పుట్టుట

  •  
  •  
  •  

8-267-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కెంపారెడు నధరంబును
జంపారెడి నడుము సతికి శంపారుచులన్
సొం పారు మోముఁ గన్నులుఁ
బెంపారుచు నొప్పుగొప్పు పిఱుఁదును గుచముల్."

టీకా:

కెంపారెడు = ఎఱ్ఱగామెరసెడి; అధరంబును = పెదవులు; జంపారెడి = ఊగుతున్న; నడుము = నడుము; సతి = స్త్రీ; కిన్ = కి; శంపా = మెరుపుల యొక్క; రుచులన్ = కాంతులతో; సొంపారు = చక్కదనాలుపొంగెడి; మోమున్ = ముఖము; కన్నులున్ = కళ్ళు; పెంపారుచును = పెద్దవగుచు; ఒప్పు = చక్కనగు; కొప్పు = సిగ; పిఱుదునున్ = పిరుదులు; కుచముల్ = స్తనములు.

భావము:

“ఎఱ్ఱని కెంపులలా మెరిసే పెదవులు, ఊగుతున్న సన్నని నడుము, మెరుపు కాంతుల మేలైన మొగము, తళుకులొత్తు కన్నులు, పెంపొందిన కొప్పు, పెద్ద కటిప్రదేశము, చిక్కని కుచాలూ ఎంత చక్కగా ఉన్నాయో” అంటూ..