పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : ఐరావత ఆవిర్భావము

  •  
  •  
  •  

8-259-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లేని నడపు వడి గల
యొలును బెను నిడుదకరము నురుకుంభములున్
బెడఁగై యువతుల మురిపపు
కలకున్ మూలగురు వనన్ గజ మొప్పెన్.

టీకా:

తడ = తడబాటు; లేని = లేనట్టి; నడపు = నడక; వడి = బిగువు; కల = కలిగిన; ఒడలునున్ = దేహము; పెను = మిక్కిలి; నిడుద = పొడవైన; కరము = తొండము; ఉరు = పెద్ద; కుంభములున్ = కుంభములు; పెడగు = మనోజ్ఞమైనది; ఐ = అయ్యి; యువతుల = ప్రాయపుస్త్రీల; మురిపపు = కులుకుల; నడకల్ = నడకల; కున్ = కు; మూలగురువు = ఒజ్జబంతి; అనన్ = అనగా; గజమున్ = ఏనుగు; ఒప్పెన్ = చక్కగానున్నది.

భావము:

ఆ ఐరావతము తడబాటు లేని నడకల వేగం కలిగినది. పెద్ద శరీరం, పొడవైన తొండము, పెద్ద కుంభస్థలము కలది, ఐరావతము నడకలు ప్రాయంలో ఉన్న స్త్రీల కులుకు నడకలకు ఒజ్జబంతి అనే విధంగా ఉంటుంది.