పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : ఐరావత ఆవిర్భావము

 •  
 •  
 •  

8-258-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

దంచతుష్టాహతి శై
లాంతంబులు విఱిగి పడఁగ వదాత కుభృ
త్కాంతంబగు నైరావణ
దంతావళ ముద్భవించె రణీనాథా!

టీకా:

దంత = దంతములు; చతుష్టా = నాలుగింటి; హతిన్ = దెబ్బకి; శైలాంతంబులున్ = కొండశిఖరములు; విఱిగిపడగన్ = కూల్చివేయగలిగి; అవదాత = వెండి (తెల్లని); కుభృత్ = కొండవలె; కాంతంబు = ప్రకాశించునది యగు; ఐరావణ = ఐరావతము యనెడి; దంతావళము = ఏనుగు; ఉద్భవించెన్ = పుట్టెను; ధరణీనాథా = రాజా.

భావము:

భూమండలాన్ని ఏలే మహారాజా! పరీక్షిత్తు! పాలసముద్రంలో “ఐరావతం” అనే ఏనుగు పుట్టింది, దానికి నాలుగు (4) దంతాలు ఉన్నాయి. వాటితో కొండల శిఖరాలను సైతం కూల్చివేయగలదు. ఆ గజరాజం వెండి కొండ వలె మనోహరంగా విలసిల్లుతూ ఉంటుంది.

8-259-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

లేని నడపు వడి గల
యొలును బెను నిడుదకరము నురుకుంభములున్
బెడఁగై యువతుల మురిపపు
కలకున్ మూలగురు వనన్ గజ మొప్పెన్.

టీకా:

తడ = తడబాటు; లేని = లేనట్టి; నడపు = నడక; వడి = బిగువు; కల = కలిగిన; ఒడలునున్ = దేహము; పెను = మిక్కిలి; నిడుద = పొడవైన; కరము = తొండము; ఉరు = పెద్ద; కుంభములున్ = కుంభములు; పెడగు = మనోజ్ఞమైనది; ఐ = అయ్యి; యువతుల = ప్రాయపుస్త్రీల; మురిపపు = కులుకుల; నడకల్ = నడకల; కున్ = కు; మూలగురువు = ఒజ్జబంతి; అనన్ = అనగా; గజమున్ = ఏనుగు; ఒప్పెన్ = చక్కగానున్నది.

భావము:

ఆ ఐరావతము తడబాటు లేన నడకలు వేగం కలిగనది. పెద్ద శరీరం, పొడవైన తొండము, పెద్ద కుంభస్థలమూ కలదీ, ఐరావతము నడకలు ప్రాయంలో ఉన్న స్త్రీల కులుకు నడకలకు ఒజ్జబంతి అనే విధంగా ఉంటుంది.

8-260-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మఱియు నత్తరంగిణీవల్లభు మథించు నయ్యెడ.

టీకా:

మఱియున్ = ఇంకను; ఆ = ఆ; తరంగిణీవల్లభున్ = సాగరుని; మథించు = చిలికెడు; ఎడన్ = సమయమునందు.

భావము:

ఇంకా సముద్రాలకే రాజు వంటి ఆ పాలవెల్లిని దేవతలూ, రాక్షసులూ చిలుకుతుంటే...