పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : సురభి ఆవిర్భావము

  •  
  •  
  •  

8-253-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గ్నిహోత్రి యనుచు నా సురభిని దేవ
మునులు పుచ్చికొనిరి మున్నెఱింగి
విబుధ సంఘములకు వెరవుతో నధ్వర
వులు పెట్టుకొఱకు వనినాథ!

టీకా:

అగ్నిహోత్రి = అగ్నిహోత్రములకు తగినది; అనుచున్ = అనుచు; ఆ = ఆ; సురభిన్ = కామధేనువును; దేవమునులు = దేవర్షులు; పుచ్చికొనిరి = తీసుకొనిరి; మున్న = ముందుగనే; ఎఱింగి = తెలిసి యుండుటచేత; విబుధ = దేవతా; సంఘముల్ = సమూహముల; కున్ = కు; వెరవు = తగినవిధము; తోన్ = ప్రకారముగ; అధ్వర = యాగ; హవులున్ = హవిస్సులను; పెట్టు = సమర్పించుట; కొఱకున్ = కోసము; అవనినాథ = రాజ.

భావము:

కామధేనువు హోమ కార్యక్రమాలకు తగినదని దేవమునులు ముందే గ్రహించారు. యజ్ఞకార్యాలకు తగినట్లు హవిస్సు సమకూర్చగల ఆ సురభి అనే కామధేనువును తీసుకున్నారు