పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : సురభి ఆవిర్భావము

  •  
  •  
  •  

8-252-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తెల్లని మేనును నమృతము
జిల్లున జల్లించు పొదుఁగు శితశృంగములుం
బెల్లుగ నర్థుల కోర్కులు
వెల్లిగొలుపు మొదవు పాలవెల్లిం బుట్టెన్.

టీకా:

తెల్లని = తెల్లటి రంగుగల; మేనునున్ = దేహము; అమృతమున్ = పాలను; జిల్లునన్ = జిల్లుమని; జల్లించు = ధారలుగానిచ్చెడి; పొదుగున్ = పొదుగు; శిత = చక్కటి, వాడియైన; శృంగములున్ = కొమ్ములు; పెల్లుగన్ = పుష్కలముగ; అర్థుల = కోరెడివారి; కోర్కులున్ = కోరికలను; వెల్లిగొలుపు = కురిపించెడి; మొదవు = పాడియావు; పాలవెల్లిన్ = పాలసముద్రమునందు; పుట్టెన్ = జనించెను.

భావము:

ఇలా చిలుకుతుంటే పాలసముద్రంలోనుండి కామధేనువు పుట్టింది. అది తెల్లని శరీరం, జిల్లుమంటూ పాలధారలను బాగా ఇచ్చే పొదుగూ, చక్కని కొమ్ములు కలిగి ఉంది. కోరిన కోరికలను పుష్కలంగా తీరుస్తుంది,