పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : గరళ భక్షణము

  •  
  •  
  •  

8-242-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

చుట్టున్ సురసంఘముల్ జయజయధ్వానంబులన్ బొబ్బిడన్
గంభీర రవంబుతో శివుఁడు "లోద్రోహి! హుం! పోకు ర"
మ్మని కెంగేలఁ దెమల్చి కూర్చి కడిగా నంకించి జంబూఫలం
ని సర్వంకషమున్ మహావిషము నాహారించె హేలాగతిన్.

టీకా:

తన = తన యొక్క; చుట్టున్ = చుట్టూ; సుర = దేవతల; సంఘముల్ = సమూహములు; జయజయ = జయజయ యనెడి; ధ్వానంబులన్ = శబ్దములతో; బొబ్బన్ = కేకలు; ఇడన్ = వేయగా; ఘన = మిక్కిలి; గంభీర = గంభీరమైన; రవంబు = శబ్దము; తోన్ = తో; శివుడు = శంకరుడు {శివుడు - మంగళప్రదుడు, శంకరుడు}; లోక = లోకములకు; ద్రోహి = హానికలిగించెడివాడా; హుం = హుం; పోకు = వెళ్ళిపోకుము; రమ్ము = రా; అని = అని; కెంగేలన్ = ఎఱ్ఱని అరచేతితో; తెమల్చి = కదిల్చి; కూర్చి = కలిపి; కడిగాన్ = ముద్దగా; అంకించి = చేసి; జంబూ = నేరేడు; ఫలంబు = పండు; అని = వలెగ్రహించి; సర్వంకషమున్ = అన్నిటిని నాశనము చేయునది; మహా = గొప్ప; విషమున్ = విషమును; ఆహారించెన్ = మింగెను; హేలా = క్రీడ; గతిన్ = వలె.

భావము:

దేవతలు మహాదేవుని చుట్టూ చేరి “జయ జయ” ధ్వానాలు చేశారు. పరమ శివుడు మేఘ గంభీర కంఠస్వరంతో “ఓహో! లోకద్రోహీ! పారిపోకు రా! రా!” అని, సర్వనాశనము చేసే ఆ హాలాహాల మహావిషాన్ని తన చేయి చాచి పట్టుకుని, ముద్ద చేసి, నేరేడు పండునోట్లో వేసుకున్నంత సుళువుగా, విలాసంగా భుజించాడు.