పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : గరళ భక్షణము

  •  
  •  
  •  

8-237-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శిక్షింతు హాలహలమును
క్షింతును మధురసూక్ష్మ లరసము క్రియన్
క్షింతుఁ బ్రాణి కోట్లను
వీక్షింపుము నీవు నేఁడు వికచాబ్జముఖీ!"

టీకా:

శిక్షింతున్ = దండించెదను; హాలాహలమున్ = హాలాహలవిషమును; భక్షింతును = ఆరగించెదను; మధుర = తీయని; సూక్ష్మ = చిన్న; ఫల = పండు; రసము = రసము; క్రియన్ = వలె; రక్షింతున్ = కాపాడెదను; ప్రాణి = జీవ; కోట్లను = జాలమును; వీక్షింపుము = చూడుము; నీవు = నీవు; నేడు = ఇప్పుడు; వికచాబ్జముఖీ = సుందరీ {వికచాబ్జముఖి - వికచ (వికసించిన) అబ్జ (పద్మము) వంటి ముఖి (ముఖముగలామె), అందమైన స్త్రీ}.

భావము:

వికసించిన పద్మం వంటి మోము గల సతీదేవీ! హాలాహలాన్ని దండిస్తాను. చాలా చిన్న తియ్యని పండు రసంవలె హాలాహలాన్ని మింగుతాను. ఇవాళ ఈ జీవలోకం సమస్తాన్ని కాపాడతాను. నువ్వు చూస్తూ ఉండు.