పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : గరళ భక్షణము

  •  
  •  
  •  

8-233-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"కంటే జగముల దుఃఖము;
వింటే జలజనిత విషము వేఁడిమి; ప్రభువై
యుంకు నార్తుల యాపద
గెంటింపఁగ ఫలము గాదె కీర్తి మృగాక్షీ!

టీకా:

కంటే = చూసితివా; జగముల = లోకముల యొక్క; దుఃఖమున్ = దుఃఖమును; వింటే = విన్నావా; జల = నీటిలో; జనిత = పుట్టిన; విషము = విషము యొక్క; వేడిమిన్ = సెగ; ప్రభువు = విభుడు; ఐ = అయ్యి; ఉంటన్ = ఉన్నందుల; కున్ = కు; ఆర్తుల = దుఃఖితుల; ఆపదన్ = కష్టమును; గెంటింపగన్ = తొలగించుటవలన; ఫలము = ఫలితముగా; కాదె = కలుగదా; కీర్తి = కీర్తి; మృగాక్షీ = సుందరీ {మృగాక్షి - మృగ (లేడి)వంటి అక్షి (కన్నులు కలామె), అందమైన స్త్రీ}.

భావము:

“ఓ లేడి కన్నుల సుందరీ! సతీదేవీ! చూడు లోకాలు ఎంత దుఃఖంలో ఉన్నాయో! ఎంత తీవ్ర ప్రభావంతో ఉన్నాయో! నీళ్ళలో పుట్టినది ఆ హాలాహల విషం. శక్తిసామర్థ్యాలుగల ప్రభువు ప్రజల కష్టాన్ని తొలగించాలి. దానితో కీర్తి వస్తుంది.