పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : శివుని గరళ భక్షణకై వేడుట

  •  
  •  
  •  

8-230-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లంటము నివారింపను
సందఁ గృపజేయ జయము సంపాదింపం
జంపెడివారి వధింపను
సొంపారఁగ నీక చెల్లు సోమార్ధధరా!

టీకా:

లంపటము = ఆపదను, తగులమును; నివారింపను = తొలగించుట; సంపదన్ = సంపదలను; కృపజేయ = ప్రసాదించుట; జయము = జయయును; సంపాదింపన్ = సంపాదించుట; చంపెడివారిన్ = క్రూరులను; వధింపను = సంహరించుట; సొంపారగన్ = చక్కగా చేయుట; నీక = నీకుమాత్రమే; చెల్లున్ = తగినది; సోమార్ధధరా = శంకరుడా {సోమార్ధధరుడు - సోమ (చంద్ర) అర్ధ (ఖండమును) ధర (ధరించినవాడు), శివుడు}.

భావము:

అర్థచంద్రుని అలంకారంగా ధరించిన మహా ప్రభూ! పరమేశ్వరా! ఈ ఆపదను తొలగించడానికి, ఆనందం చేకూర్చడానికి, జయాన్ని సంపాదించడానికి, క్రూరులను హతమార్చడానికి నీవు మాత్రమే సమర్థుడవు.