పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : శివుని గరళ భక్షణకై వేడుట

  •  
  •  
  •  

8-227-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మూఁడు మూర్తులకును మూఁడు లోకములకు
మూఁడు కాలములకు మూల మగుచు
భేద మగుచుఁ దుది నభేదమై యొప్పారు
బ్రహ్మ మనఁగ నీవ ఫాలనయన!

టీకా:

మూడుమూర్తుల్ = త్రిమూర్తుల {త్రిమూర్తులు - 1బ్రహ్మ 2విష్ణు 3మహేశ్వరులు}; కును = కు; మూడులోకముల్ = ముల్లోకముల {ముల్లోకములు - 1భూః 2భువః 3సువః పక్షాంతరమున 1భూలోకము 2మర్త్యలోకము 3పాతాళలోకములు}; కును = కు; మూడుకాలముల్ = కాలత్రయమున {కాలత్రయము - 1భూత 2భవిష్య 3వర్తమానకాలములు}; కున్ = కు; మూలము = ఆధారభూతుడవు; అగుచున్ = అగుచు; భేదము = ద్వైతము; అగుచున్ = అగుచును; తుదిని = చివరకు; అభేదము = అద్వైతము; ఐ = అయ్యి; ఒప్పారు = ఒప్పుతున్న; బ్రహ్మము = పరబ్రహ్మము; అనగన్ = అంటే; నీవ = నీవే; ఫాలనయన = ఆదిశంకర {ఫాలనయనుడు - ఫాల (నుదుట) నయనుడు (కన్నుగలవాడు), శివుడు}.

భావము:

నుదుట కన్ను గల ముక్కంటి! శంకరా! ముగ్గురు మూర్తులకూ, మూడులోకాలకూ, మూడు కాలాలకూ నీవే మూలం. మొదట భేదంతో కనిపించినా, చివరకి అభేద స్వరూపంతో ఒప్పారుతుండే పరబ్రహ్మవు నీవే.