పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : శివుని గరళ భక్షణకై వేడుట

 •  
 •  
 •  

8-224-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

గ్నిముఖంబు; పరాపరాత్మక మాత్మ-
కాలంబు గతి; రత్నర్భ పదము;
శ్వసనంబు నీ యూర్పు; సన జలేశుండు-
దిశలుఁ గర్ణంబులు; దివము నాభి;
సూర్యుండు గన్నులు; శుక్లంబు సలిలంబు-
ఠరంబు జలధులు; దలు శిరము;
ర్వౌషధులు రోమయములు; శల్యంబు-
ద్రులు; మానస మృతకరుఁడు;

8-224.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఛందములు ధాతువులు; ధర్మమితి హృదయ;
మాస్య పంచక ముపనిష దాహ్వయంబు;
యిన నీ రూపు పరతత్త్వమై శివాఖ్య
మై స్వయంజ్యోతి యై యొప్పునాద్య మగుచు.

టీకా:

అగ్ని = అగ్ని; ముఖంబున్ = ముఖము; పర = పరమాత్మ; అపర = జీవాత్మ; ఆత్మకము = కలయిక; ఆత్మ = ఆత్మ; కాలంబు = కాలము; గతి = నడక; రత్నగర్భ = సముద్రము {రత్నగర్భ - రత్నములు గర్భమునగలది, సముద్రము}; పదము = పాదము; శ్వసనంబు = వాయువు; నీ = నీ యొక్క; ఊర్పు = శ్వాస; రసన = నాలుక; జలేశుండు = వరుణుడు {జలేశుడు - నీటికి ప్రభువు, వరుణుడు}; దిశలున్ = దిక్కులు; కర్ణంబులు = చెవులు; దివము = పగలు; నాభి = బొడ్డు; సూర్యుండు = సూర్యుడు; కన్నులు = నేత్రములు; శుక్రంబు = వీర్యము; సలిలంబు = నీరు; జఠరంబు = గర్భము; జలధులు = సముద్రములు {జలధి - జలమునకు నిధి, సముద్రము}; చదలు = ఆకాశము; శిరము = తల; సర్వ = సమస్తమైన; ఓషధులు = ఓషధులు; రోమ = రోమముల; చయములు = సమూహములు; శల్యంబు = ఎముకలు; అద్రులు = పర్వతములు; మానసము = మనస్సు; అమృతకరుడు = చంద్రుడు {అమృతకరుడు - అమృతమయములైన కరములు (కిరణములు) కలవాడు, చంద్రుడు}.
ఛందములు = వేదములు; ధాతువులు = సప్తధాతువులు {సప్తధాతువులు - 1వస 2అసృక్కు 3మాంసము 4మేధస్సు 5అస్థి 6మజ్జ 7శుక్లములు పక్షాంతరమున 1రోమ 2త్వక్ 3మాంస 5అస్థి 6స్నాయు 6మజ్జా 7ప్రాణములు}; ధర్మ = శాస్త్రధర్మముల; సమితి = సమూహములు; హృదయము = హృదయము; ఆస్య = ముఖములు; పంచకము = ఐదును; ఉపనిషత్ = ఉపనిషత్తుల; ఆహ్వయంబున్ = పేర్లు; అయిన = ఐన; నీ = నీ యొక్క; రూపు = స్వరూపము; పరతత్త్వము = ఆత్మజ్ఞానరూపము; ఐ = అయ్యి; శివ = శివుడు యనెడి; ఆఖ్యము = పేరుగలది; ఐ = అయ్యి; స్వయంజ్యోతి = స్వయంప్రకాశకుడవు; ఐ = అయ్యి; ఒప్పున్ = తగును; ఆద్యము = సృష్ట్యాదినుండిగలది; అగుచున్ = అగుచు.

భావము:

అగ్ని నీ ముఖము, జీవాత్మ పరమాత్మ నీవే అయి ఉంటావు, కాలం నీ నడక, భూమండలం నీ పాదం, వాయువు నీ శ్వాస, వరుణుడు నీ నాలుక, దిక్కులు నీ చెవులు, స్వర్గం నీ నాభి, సూర్యుడు నీ దృష్టి, నీరు నీ వీర్యం, సముద్రాలు నీ గర్భం, ఆకాశం నీ శిరస్సు, ఓషదులు నీ రోమ సమూహాలు, పర్వతాలు నీ ఎముకలగూడు, చంద్రుడు నీ మనస్సు, వేదాలు నీ ధాతువు, ధర్మశాస్త్రాలు నీ హృదయం, ఉపనిషత్తులు నీ ముఖాలు, నీ రూపం పరతత్వం, నీవు స్వయంప్రకాశుడవు, శివ అనే నామం కలిగిన పరంజ్యోతివి నీవు.