పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : సముద్రమథన వర్ణన

  •  
  •  
  •  

8-211-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఁ గుడి మునుపు దిరుగుచు
గుడి నెడమను వెనుకఁ దిరుగు కులగిరి గడలిం
లెడల సురలు నసురులుఁ
దొడితొడి ఫణి ఫణము మొదలుఁ దుదియును దిగువన్.

టీకా:

ఎడమన్ = ఎడమనుండి; కుడి = కుడిపక్కకు; మునుపు = ముందుకు; తిరుగుచున్ = తిరుగుతు; కుడిన్ = కుడినుండి; ఎడమనున్ = ఎడమపక్కకి; వెనుకన్ = వెనుకకు; తిరుగు = తిరుగును; కులగిరి = కులపర్వతము; కడలిన్ = సముద్రమును; కడలు = చివర్లవరకు; ఎడలన్ = ఎగసిపోవునట్లుగ; సురలున్ = దేవతలు; అసురులున్ = రాక్షసులు; తొడితొడిన్ = తొందరతొందరగా; ఫణి = పాము యొక్క; ఫణము = పడగల; మొదలున్ = మొదలు; తుదిన్ = తోకను; తిగువన్ = లాగుచుండగా.

భావము:

సర్పరాజు తోకా తలా పట్టుకుని దేవతలూ రాక్షసులూ కలిసి, వంతులువారీగా తొందర తొందరగా ముందుకూ వెనక్కూ కదులుతూ ఉంటే, మంథర పర్వతం ఎడం పక్క నుండి కుడి పక్కకు, మరల కుడి పక్క నుండి ఎడం పక్కకు అలా తిరుగసాగింది.