పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : 1స్వాయంభువ మనువు చరిత్ర

  •  
  •  
  •  

8-8-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రూపాపతి కామభోగ విరతిన్ సంత్యక్త భూ భారుఁడై
తియుం దానును గాన కేఁగి, శతవర్షంబుల్ సునందానదిన్
వ్రతియై యేక పదస్థుఁడై నియతుఁడై వాచంయమస్ఫూర్తితో
దోషుండు తపంబుజేసె భువనఖ్యాతంబుగా భూవరా!

టీకా:

శతరూపాపతి = స్వాయంభువమనువు {శతరూప పతి - శతరూప యొక్క భర్త, స్వాయంభువుడు}; కామ = కామములు; భోగ = భోగములు యెడల; విరతిన్ = విరక్తితోను; సంత్యక్త = విడిచిపెట్టేసిన; భూ = రాజ్యము యొక్క; భారుడు = భారము గలవాడు; ఐ = అయ్యి; సతియున్ = భార్యయును; తానున్ = తను; కానన్ = అడవి; కిన్ = కి; ఏగి = వెళ్ళి; శత = నూరు; వర్షంబుల్ = సంవత్సరములు; సనంద = సునంద అనెడి; నదిన్ = నదివద్ద; వ్రతి = నిష్ఠ గలవాడు; ఐ = అయ్యి; ఏకపదస్థుడు = ఒంటికాలిపై నిలిచిన వాడు; ఐ = అయ్యి; నియతుఁడు = నియమములు గలవాడు; ఐ = అయ్యి; వాచంయమ = మౌనుల యొక్క {వాచంయముడు – మౌనవ్రతము గలవాడు, మౌని}; స్ఫూర్తి = రీతి; తోన్ = తోటి; గత = పోయిన; దోషుండు = దోషములు గలవాడు; తపంబున్ = తపస్సును; చేసెన్ = చేసెను; భువన = విశ్వమంతా; విఖ్యాతంబుగా = పేరుపొందునట్లు; భూవరా = రాజా .

భావము:

ఓ రాజా! శతరూప భర్త అయిన స్వాయంభువ మనువు కామ భోగాల యందు విరక్తుడై, రాజ్య భారాన్నీ విడిచిపెట్టి, తన భార్య శతరూపతోపాటు, అడవికి వెళ్ళాడు. సునందా నది దగ్గర, పవిత్రమైన నియమ నిష్ఠలతో, మౌనంగా ఒంటి కాలి మీద నిలబడి, నూరేళ్లు విశ్వవిఖ్యాతమైన తపస్సు చేసాడు.